2023 ఐపీఎల్ లో రాజస్థా రాయల్స్ జట్టు అన్ని లీగ్ మ్యాచులు ఆడేసింది. ఇక ఈ జట్టు భవితవ్యం వేరే జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు గుజరాత్, సన్ రైజర్స్ జట్లను వేడుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది.
ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచులు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఇక మిగిలింది నాలుగు మ్యాచ్ లే అయినా.. ఇప్పటివరకు కేవలం గుజరాత్ జట్టు మాత్రమే ప్లే ఆఫ్ కి వెళ్ళింది. మిగిలిన మూడు బెర్తుల కోసం మరో 6 జట్లు రేస్ లో ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో ఏ జట్లు ప్లే ఆఫ్ కి వెళ్తాయో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇదిలా ఉండగా.. కొన్ని జట్ల భవితవ్యం వేరే జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఈ లిస్టులో ప్రధమ వరుసలో ఉంది రాజస్థాన్ రాయల్స్. అయితే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్.. గుజరాత్, సన్ రైజర్స్ జట్లను వేడుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది. మరి పరాగ్ ఇలా ఎందుకు అన్నాడు ?
2023 ఐపీఎల్ లో రాజస్థా రాయల్స్ జట్టు అన్ని లీగ్ మ్యాచులు ఆడేసింది. 14 మ్యాచులు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5 వ స్థానంలో నిలిచింది. ఇక ఈ జట్టు ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే.. ముఖ్యంగా రెండు మ్యాచులు కీలకం కానున్నాయి. అదేంటి మొత్తం లీగ్ మ్యాచులు ఆడేసిందిగా ఇంకా రెండు మ్యాచులేంటి అనుకోకండి. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న రాజస్థాన్ ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే అది గుజరాత్, సన్ రైజర్స్ చేతిలోనే ఉంది. అది ఎలాగంటే ?
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ మాత్రమే ప్లే ఆఫ్ వెళ్ళింది. ఇక 15 పాయింట్లతో చెన్నై, లక్నో జట్లు ఉండగా.. 14 పాయింట్లతో బెంగళూరు, ముంబై జట్లు ఉన్నాయి. ఇప్పుడు చెన్నై, లక్నో తమ చివరి మ్యాచులో ఎలాంటి ఫలితం వచ్చినా.. రాజస్థాన్ జట్టుకి నష్టం లేదు. కానీ బెంగళూరు, ముంబై జట్లలో ఏ ఒక్క టీం అయినా.. తమ చివరి లీగ్ మ్యాచుల్లో గెలిస్తే.. రాజస్థాన్ ఇక ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఖచ్చితంగా ఈ రెండు జట్లు ఓడిపోవాలి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ గుజరాత్, సన్ రైజర్స్ తమ చివరి లీగ్ మ్యాచుల్లో బాగా ఆడాల్సిందిగా ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. మరి పరాగ్ చేసిన రిక్వెస్ట్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.