కొందరు ప్లేయర్లకు ఒక్క ఛాన్స్ వచ్చినా తామేంటో నిరూపించుకుంటారు. ఇంకొందరు మాత్రం ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫెయిలవుతూ, జట్లను అంటిపెట్టుకుని ఉండిపోతారు. ప్రతిసారి విఫలమవుతూ టీమ్స్‌కు భారంగా మారతారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వల్ల ఎందరో అనామక క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. దొరికిన బంగారం లాంటి అవకాశాలను వాడుకుంటూ జాతీయ జట్టు తలుపులను బలంగా తట్టారు. ఐపీఎల్ ప్రదర్శనలను పునరావృతం చేస్తూ నేషనల్ టీమ్స్‌లో సెటిల్ అవుతున్నారు. దీనికి సూర్య కుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ సహా చాలా మంది ప్లేయర్లను ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే అదే సమయంలో ఐపీఎల్ ఆడే ఛాన్స్ ఉపయోగించుకోని దేశవాళీ ప్లేయర్లూ ఉన్నారు. అలాంటి వారిలో రాజస్థాన్ యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను ఒకడిగా చెప్పొచ్చు. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడతడు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున 2019లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు రియాన్ పరాగ్. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన తొలి మ్యాచులో 16 రన్స్ చేసి ఫర్వాలేదనిపించాడీ అసోం కుర్రాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆట కంటే గ్రౌండ్లో తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. గత సీజన్లో కేవలం 183 రన్స్ చేసి, ఒక వికెట్ మాత్రమే తీసిన పరాగ్.. ఈ ఏడాది ఐపీఎల్లో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో కలిపి అతడు చేసిన రన్స్ కేవలం 39. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 7 బాల్స్ ఎదుర్కొని 5 రన్స్ మాత్రమే చేశాడు. ఇన్నేళ్ల నుంచి ఇన్ని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నా రియాన్ ఆటలో మాత్రం మార్పు రావడం లేదు.
వరుసగా ఫెయిల్ అవుతున్న రియాన్ పరాగ్ జట్టులో కొనసాగడానికి బంధు ప్రీతే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ ఓనర్లతో రియాన్ అంకుల్‌కు సత్సంబంధాలు ఉన్నాయట. అందుకే విఫలమవుతున్నా టీమ్‌లో ప్లేస్ పక్కా అనే ధీమాతో ప్రత్యర్థి బ్యాటర్లు ఔటైనప్పుడు గ్రౌండ్లో వెకిలి చేష్టలు చేస్తున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు. అసలు రియాన్ పరాగ్ ఏం పొడిచాడని అతడ్ని టీమ్‌లో కొనసాగిస్తున్నారని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాన్ని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ముంబై ఇండియన్స్‌తో మంచి సంబంధాలు ఉన్నా సచిన్ తన కొడుకు అర్జున్ టెండూల్కర్‌ను ఇన్నేళ్లుగా బెంచ్ పైనే కూర్చోబెట్టాడని అంటున్నారు. రియాన్ ఆడగా లేనిది.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఆడితే తప్పేంటని క్వశ్చన్ చేస్తున్నారు. మరి.. దీనిపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
2019- He is a Kid and he’s learning.
2020- He is a Kid and he’s learning.
2021- He is a Kid and he’s learning.
2022- He is a Kid and he’s learning.
2023- He is a Kid and he’s learning
2040- He is a Kid and he’s still learning.
Lord Riyan Parag pic.twitter.com/WnunyQ0dpZ— StrawHat Luffy (@PirateKing200) April 16, 2023
Just Riyan Parag things✨#RRvsGT pic.twitter.com/opGLPOa0TI
— Abisek (@mayyena) April 16, 2023
Riyan Parag in every match of IPL 2023#RRvsGT #RiyanParag #GTvsRR pic.twitter.com/IvnuarSP5t
— Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) April 16, 2023