ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి రెండు ఓటముల తర్వాత పుంజుకుంది. ఆ రెండు ఓటముల తర్వాత రెండు వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చింది SRH. కాగా ఐపీఎల్ మెగా వేలం తర్వాత.. టీమ్ సరిగా లేదని ఆ జట్టు ఓనర్ కావ్య మారన్‌పై SRH ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. వారి అనుమానాలు నిజం అవుతూ.. SRH ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో ఓడింది. దీంతో కావ్యపై సోషల్‌మీడియాలో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. కానీ వీటిని పట్టించుకోని కావ్య.. జట్టును ఎంకరేజ్ చేసేందుకు మ్యాచ్‌లు చేసేందుకు వచ్చేది. జట్టు ప్రదర్శన బాగుంటే ఫుల్ ఖుషీగా, బాగలేకుంటే డల్‌గా హావభావాలు పలికిస్తూ.. సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యేది.
ఈ సీజన్‌లో SRH ఆడిన రెండు మ్యాచ్‌లకు కావ్య హాజరై.. జట్టు ప్రదర్శనతో నిరాశ చెందింది. ఎందుకంటే ఆ రెండు మ్యాచ్‌లలో SRH ఓడింది. కానీ.. తర్వాతి రెండు మ్యాచ్‌లలో SRH అద్భుత ఆటతీరుతో విజయాలు సాధించింది. కానీ.. ఈ రెండు మ్యాచ్‌లకు మాత్రం కావ్య పాప రాలేదు. దీంతో.. కావ్య మారన్ మ్యాచ్ చూసేందుకు వస్తే SRH ఓడిపోతుందని, రాకుంటేనే గెలుస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొత్త వాదన తెరపైకి తెచ్చారు. నిజానికి కావ్య తన టీమ్ విజయాన్ని ఎంతగానే ఆకాంక్షిస్తుంది. ఒక సాధారణ ఫ్యాన్‌లా బౌండరీ వచ్చినా, వికెట్ పడినా అందుకుతగ్గట్లు ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. మొత్తానికి మ్యాచ్‌లో లీనమైపోతుంది. జట్టు గెలవాలన్న కసి తనలో కనిపిస్తుంది.
నిజానికి అలాంటి ఓనర్ ఉండడం నిజంగా SRH చేసుకున్న అదృష్టం. కానీ.. ఒక జట్టు గెలుపోటములు అనేవి.. ఆ రోజు ఆ టీమ్ ప్లేయర్ల ఆడే విధానంపై ఆధారపడి ఉంటుంది. అంతేకానీ.. టీమ్ ఓనర్ అయినంత మాత్రానా ఒక వ్యక్తికి ఆ టీమ్ జయాపజేయాలను ఆపాదించడం సమజసం కాదని మరికొంత మంది న్యూట్రల్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. టీ20 క్రికెట్ అంటేనే అనిశ్చిత్తికి మారుపేరు.. ఇలాంటి ఆటలో ఏ టీమ్ ఎప్పుడు గెలుస్తుందో? ఏ టీమ్ ఎప్పుడు ఓడుతుందో చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో కావ్య మారన్‌కు SRH ఓటములు ఆపాదించి.. ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: SRHకు షాక్! స్టార్ ఆల్‌రౌండర్ జట్టుకు దూరం
Kavya Maran in the stadium 👏❤️#IPL2022 #LSG pic.twitter.com/isae6ePVQe
— CRICKET🏏 (@AbdullahNeaz) April 4, 2022
I think #Congress should hire Kavya Maran as thier poll strategist.
Coz , she has this effortless ability to descimate the “Orange army”😶#SRHvLSG #BJP pic.twitter.com/qAQPodZbSV— Pratyush Mahapatra (@Pratyush__27) April 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.