ఐపీఎల్ లో ఈసారి అత్యంత వరస్ట్ ప్రదర్శన ఇచ్చిన టీమ్ అంటే అందరూ సన్ రైజర్స్ పేరు చెబుతారు. ఇలా ఆడేసరికి అందరూ రెలిగేషన్ రూల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ దీన్ని తీసుకొస్తే.. వచ్చే ఐపీఎల్ లో సన్ రైజర్స్ పై నిషేధం గ్యారంటీ.
మీకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టంటే పిచ్చి ఇష్టమా? అయితే గుండెని రాయి చేసుకుని ఈ స్టోరీ చదవండి. ఎందుకంటే వచ్చే సీజన్ లో మీ అభిమాన జట్టు ఆడకపోవచ్చు. ఈ సీజన్ లో ఇచ్చిన ఫెర్ఫార్మెన్స్ వల్ల అనుకోనిది జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ బీసీసీఐ తలుచుకుంటే రెలిగేషన్ రూల్ తీసుకొస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే సన్ రైజర్స్ తిక్క కుదురుతుంది. సరే ఇదంతా పక్కనబెట్టు ఇంతకీ రెలిగేషన్ రూల్ అంటే ఏంటని అంటారా? అక్కడికే వచ్చేస్తున్నాం.. కూల్ గా ఈ స్టోరీ చదివేయండి. దీని లెక్కేంటో తెలిసిపోతుంది!
అసలు విషయానికొచ్చేస్తే.. ఐపీఎల్ మొదలై 15 ఏళ్లు గడిచిపోయింది. ప్రస్తుతం జరుగుతున్నది 16వ సీజన్. ఈసారి కప్ ఎవరు కొడతారనే సంగతి అటుంచితే.. ప్లే ఆఫ్స్ రేసే మంచి రంజుగా మారిపోయింది. ఎందుకంటే నిన్నటి మ్యాచ్ జరగకముందు వరకు దిల్లీ మాత్రమే ఎలిమినేట్ అయింది. తాజాగా గుజరాత్ చేతిలో సన్ రైజర్స్ ఓడిపోయింది. ఈ సీజన్ లో దిల్లీ తర్వాత అసోం ట్రైన్ ఎక్కిన రెండో టీమ్ గా నిలిచింది. అయితే సన్ రైజర్స్ పై ఎప్పుడూ లేనంతగా ఈసారి విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. దానికి బలమైన కారణం కూడా ఉంది.
2008 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్న హైదరాబాద్ టీమ్.. 2009లో డెక్కన్ ఛార్జర్స్ జట్టుగా ఉన్నప్పుడు, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ గా ఉన్నప్పుడు ట్రోఫీ గెలుచుకుంది. మిగతా సీజన్లలోనూ మరీ వరస్ట్ గా కాకపోయినా ఓ మాదిరిగా ఆడుతూ వచ్చింది. కాస్త అయినా సరే గేమ్ స్పిరిట్ చూపించేది. ఈ సీజన్ లో మాత్రం సన్ రైజర్స్ కి చెందిన ఏ ఒక్క ప్లేయర్ కూడా జట్టుని గెలిపించాలి అనేలా ఆడలేదు. గత 9 మ్యాచ్ ల్లో హెన్రిచ్ క్లాసెన్.. కాస్తోకూస్తో బ్యాటింగ్ లో పర్వాలేదనిపించాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ మార్క్రమ్, రూ.13 కోట్ల ప్లేయర్ హ్యారీ బ్రూక్.. పెద్ద బొమ్మ చూపించారు.
ఇలా సీజన్ లో ఏ మాత్రం గేమ్ స్పిరిట్ చూపించకుండా ఆడిన సన్ రైజర్స్ ని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. ఇదే టైంలో ఫుట్ బాల్ లీగ్స్ లో బాగా పాపులర్ అయిన రెలిగేషన్ రూల్ తెరపైకి వచ్చింది. ఐపీఎల్ లోనూ దీన్ని తీసుకురావాలని, అప్పుడు సన్ రైజర్స్ తిక్కకుదురుతుందని అంటున్నారు. ఈ నిబంధన ప్రకారం.. ఏ సీజన్ లోనైనా ఏదైనా జట్టు సరిగా ఆడకుండా చివరి స్థానంలో నిలబడితే.. ఆ టీమ్ పై వచ్చే సీజన్ ఆడకుండా నిషేధం విధిస్తారు. ఇదే గనుక బీసీసీఐ అమలు చేస్తే.. దీనికి బలైపోయే ఫస్ట్ టీమ్ సన్ రైజర్స్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ రూల్ ఐపీఎల్ లో తీసుకొస్తే ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.