ధోని స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా.. కెప్టెన్సీ భారాన్ని మోయలేక.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జడేజా కెప్టెన్సీ నుంచి తనకు తానుగా తప్పుకోలేదని.. యాజమాన్యంతో విభేదాల వల్లే తప్పించారని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే సీఎస్‌కే ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాను అన్‌ఫాలో చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తుంది. దీనికి తోడూ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యా్చ్‌కు జడేజాను పక్కనబెట్టడం వెనుక సీఎస్కే ఫ్రాంచైజీ హస్తం ఉన్నట్లు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజమైతే ఎన్నో ఏళ్లుగా సీఎస్‌కేకు నమ్మదగిన ఆటగాడిగా ఉన్న జడేజాకు ఆ జట్టుతో అనుబంధం ఇదే ఆఖరది కావచ్చొని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే ధోని కెప్టెన్‌గా తప్పుకోవడంతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ జడేజాను కెప్టెన్‌గా నియమించింది. జడేజా కూడా కెప్టెన్సీ బాధ్యతలను సంతోషంగా అంగీకరించినప్పటికి.. నాయకత్వంలో ఘోరంగా విఫలమయ్యాడు. ధోని పెద్దన్న పాత్ర పోషించినప్పటికి సీఎస్‌కేకు వరుసగా పరాజయాలే ఎదురయ్యాయి. దీంతో ఒత్తిడిని తట్టుకోలేక జడేజా కెప్టెన్సీని తిరిగి ధోనికే అప్పగించాడు. అయితే.. జడేజా కెప్టెన్సీ నుంచి తనకు తానుగా తప్పుకోలేదని.. యాజమాన్యంతో విభేదాల వల్లే తప్పించిందని వార్తలొస్తున్నాయి. అందుకు తగ్గట్లే సీఎస్‌కే ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాను అన్‌ఫాలో చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయంపై నెట్లీజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. గతంలో రైనా విషయంలో ఇలానే జరిగిందని.. ఇక జట్టు నుంచి తప్పించడమే నెక్స్ట్ ఎపిసోడ్ అని కామెంట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Rovman Powell: పేదరికం నుంచి బయటపడేందుకు క్రికెటర్ అయ్యాను: పావెల్
CSK unfollows former skipper Ravindra Jadeja on Instagram; reports of between both rise up@CricCrazyJohns @mufaddal_v0hra @mufaddal_vohra @im_Priyanshu_B7 @FOREVER_VK_FAN @CamlinTweets @prathamesh18451 @tanishqdaga09 @ItsMeTanishq @ritik_____raj @Grisham_45 @ShubhamGomase15 pic.twitter.com/UcvnDa1buF
— rcb🤣Ea sala Toffee Namde🥳🥳🥳🥳🥳 (@Rock2op0071) May 11, 2022
ఇక ధోని, రైనా తర్వాత సీఎస్కేలో మంచి పేరుంది.. జడేజాకే. 2012లో తొలిసారి సీఎస్‌కేలో అడుగుపెట్టిన జడేజా.. మధ్యలో గుజరాత్ లయన్స్(రెండు సీజన్లు సీఎస్కేపై నిషేధం)కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2016లో రూ. 9.5 కోట్లకు జడేజాను సీఎస్‌కే కొనుగోలు చేసింది. అప్పటినుంచి జడ్డూ సీఎస్‌కేకు ఆడుతూ వస్తున్నాడు. గత సీజన్ వరకు అద్భుతంగా ఆడిన జడేజా.. ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. టాప్ క్లాస్ ఆల్‌రౌండర్‌గా పేరున్నప్పటికీ.. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ పెద్దగా రాణించిందిలేదు.
Series of Events within 3 weeks:
Jadeja step down from captaincy✅
CSK unfollowed jadeja on IG✅
Jadeja ruled out of IPL coz he got injured✅Next will all know 😉 pic.twitter.com/xrvnWAuO1E
— A (@18_kattar) May 11, 2022
ఐపీఎల్ 2022 సీజన్ లో సీఎస్‌కే దారుణ ప్రదర్శన చేసింది. గతేడాది చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే ఈసారి మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 4 ఓటములు, ఏడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్కే ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే. అయితే సీఎస్‌కే దారుణ ప్రదర్శనకు కెప్టెన్సీ మార్పు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక సీఎస్కే తన తర్వాతి మ్యాచ్ మే 12న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.