మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎంత ప్రమాదకర ఆటగాడో అందరకి తెలుసు. తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగల రషీద్, బ్యాటింగ్ లోనూ రాణించగలడు. 2017లో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన రషీద్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్.. ఇలాంటి మేటి బ్యాటర్లను సైతం తన బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. ఇక సాధారణ ఆటగాళ్లు.. ఈ ఓవర్ లో అవుట్ కాకుంటే చాలురా బాబోయ్ అని ఆలోచించడమే. పరుగులు కట్టడి చేయడంతో పాటుగా.. వికెట్లు పడగొట్టడం అతడి స్పెషల్. ఒక్క ఓవర్లోనే తన మాయాజాలంతో మ్యాచును మలుపుతిప్పగలడు. ఈ క్రమంలోనే కేకేఆర్ తో జరిగిన మ్యాచులో వెంకటేష్ అయ్యర్ ను అవుట్ చేయడం ద్వారా టోర్నీలో 100 వికెట్ల మార్క్ అందుకున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్ లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న రషీద్ బౌలింగ్ తో పాటు, బ్యాటింగ్ లోనూ రాణిస్తున్నాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్‌పై సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రషీద్ అంతపెద్ద వికెట్ టేకరేం కాదని, అతడు లేకున్నా తాము మ్యాచులు గెలుస్తున్నాం కదా అని చెప్పుకొచ్చారు. ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడిన లారా.. “రషీద్ ఖాన్‌పై నాకు చాలా గౌరవం ఉంది. రషీద్ ఇప్పుడు జట్టులో లేకున్నా.. మాకు సరైన కాంబినేషన్ ఉంది. రషీద్ బౌలింగ్ వేస్తున్నాడంటే.. ప్రత్యర్థి బ్యాటర్లు డిఫెన్స్ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. అంతేకాని రషీద్ పెద్ద వికెట్ టేకరేం కాదు” అని అన్నారు.
রাশিদকে কটাক্ষ! #IPL2022 #RashidKhan #BrainLara https://t.co/fKhGlWNPcM pic.twitter.com/hN7ssLKOxL
— zee24ghanta (@Zee24Ghanta) April 25, 2022
ఇది కూడా చదవండి: ఐపీఎల్ నుంచి తమతో పాటు CSKనూ తీసుకెళ్లిన ముంబై
“ఎకానమీ పరంగా ఓవర్‌కు 5-6 పరుగులు మాత్రమే ఇవ్వడం నిజంగా గ్రేటే. రషీద్ విషయంలో ఎకానమీ చాలా బాగుంటుంది. అయితే మనకు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. అతను పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. తను కూడా రషీద్ లాగే మాకో ఆస్తి అని నేను భావిస్తా. గాయపడ్డ సుందర్ స్థానంలో సుచిత్ వచ్చాడు. అతను కూడా బాగా రాణిస్తున్నాడు. మేం ఇప్పటివరకు ప్రతి మ్యాచులో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాం. రానున్న మ్యాచ్‌లలో పిచ్‌లు మారవచ్చు. స్పిన్‌కు అనుకూలంగా కావొచ్చు. అప్పుడు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగొచ్చు. మరో స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ కూడా ఉన్నాడు. అతను ఇప్పటివరకు ఒక్క గేమ్ ఆడకున్నా.. ఐపీఎల్‌లో అతను హ్యాట్రిక్ సాధించిన విషయం మర్చిపోకూడదు” అని చెప్పుకొచ్చాడు.
Lara also mentioned “if he was a member of this team, I think we might have been 7 out of 7, I don’t know”@mufaddal_vohra
Try to share his entire view from the interview or don’t share it at all. sharing only some part of statement creates unnecessary controversy.#RashidKhan https://t.co/uZswqYfodC pic.twitter.com/4WwNbMIlpL— Save humanity 🕊️ (@simba_100_) April 25, 2022
“ఐపీఎల్లో మా సత్తాను చాటడానికి ఇంకా సమర్థులైన ప్లేయర్లు మా రిజర్వ్ బెంచ్‌లో ఉన్నారు. దీని వల్ల రషీద్ లేకున్నా మాకు పెద్దగా ఆందోళనేం లేదు. రషీద్ ఖాన్ జట్టులో సభ్యుడిగా ఉంటే సంతోషించేవాడిని.. అతను ఉంటే మేము ఏడు మ్యాచుల్లో ఏడు గెలిచి ఉండవచ్చేమో.. అని లారా పేర్కొన్నాడు.
శనివారం(ఏప్రిల్ 23) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రషీద్, ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. డ్వేన్ బ్రావో (179), లసిత్ మలింగ (170), సునీల్ నరైన్ (149) తర్వాత 100 వికెట్లు తీసిన నాలుగో విదేశీ ప్లేయర్‌గా రషీద్ నిలిచాడు. మరోవైపు అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రాతో పాటు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (83 మ్యాచ్‌లలో) 100 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు.
2017 – 17 wickets
2018 – 21 wickets
2019 – 17 wickets
2020 – 20 wickets
2021 – 18 wickets93 wickets for #SRH with an avg of 20.58 eco of 6.30
2022 – 8 wickets in 7 match – avg 22.75 – eco – 6.50
101 wickets in 83 matches .
Soo *****
King @rashidkhan_19#RashidKhan
— Jaxy – Cricket (@JaxyCricket) April 25, 2022
Virat Kohli, Babar Azam and Kane Williamson 🔥
What do you think about Rashid Khan’s dream hat-trick lineup❓ #BabarAzam #ViratKohli #RashidKhan pic.twitter.com/oBRQKKFF0W
— CricWick (@CricWick) April 24, 2022
ఇది కూడా చదవండి: వరుసగా రెండు గోల్డెన్ డక్ అవుట్స్! కోహ్లీకి అండగా పాక్ ఫ్యాన్స్