కరోనా మహమ్మారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదిలేలా లేదు. నిన్నటి వరకు ఆ జట్టులో ఐదుగురు కరోనా బారిన పడగా, తాజాగా మరో ఆటగాడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడిన ఆటగాడు ఎవరన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. జాతీయ మీడియా కథనం మేరకు మరో విదేశీ ఆటగాడు ఈ వైరస్ బారిన పడినట్లు సమాచారం. ఢిల్లీ జట్టు ఇవాళ (ఏప్రిల్ 20) రాత్రి 7:30 గంటలకు పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉండగా.. మరో కోవిడ్ కేసు బయటపడటంతో మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
గతేడాది కరోనా మహమ్మారి కారణంగా లీగ్ ను అర్ధాంతరంగా వాయిదా వేసి.. విదేశాల్లో నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఏడాది అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో.. కఠినమైన బయో బబుల్ మధ్య మ్యాచులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. వైరస్ విస్తరించే అవకాశాలు ఉండటంతో ఇప్పటికే మ్యాచ్ వేదికను పూణే నుంచి ముంబైకి షిఫ్ట్ చేసిన బీసీసీఐ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించాలా వద్దా అన్న విషయంపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
🚨NEWS ALERT 🚨
According to Reports Tim seifert test positive for covid 19 seifert is the second overseas player for delhi capital covid 19 tests positive.#IPL2022 #DelhiCapitals #CricketTwitter pic.twitter.com/dNosa337Y1
— Cricket Syco (@cricket_syco) April 20, 2022
Delhi Capitals vs Punjab Kings match will go ahead tonight even after one player Tested positive for COVID-19. (Source – Indian Express)
— Johns. (@CricCrazyJohns) April 20, 2022
ఇది కూడా చదవండి: అమ్మకు ఓకే అంట శ్రేయాస్.. నన్ను పెళ్లి చేసుకుంటావా!
ఢిల్లీ జట్టులో ప్యాట్రిక్ ఫర్హార్ట్ (ఫిజియో), మిచెల్ మార్ష్ (ప్లేయర్), చేతన్ కుమార్ (స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్), డాక్టర్ అభిజిత్ సాల్వి (టీమ్ డాక్టర్), ఆకాశ్ మానే (సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్)లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరిలో మిచెల్ మార్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఫర్హార్ట్ ఐసోలేషన్‌లో ఉన్నాడు.
It’s been a tough few days, but the DC squad is pumped and ready for #DCvPBKS 👊🏼#YehHaiNayiDilli | #IPL2022#TATAIPL | #IPL | #DelhiCapitals | @davidwarner31 pic.twitter.com/yk3mTiiZqe
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2022
*A case of covid detected in Delhi Capitals*
MI fans to IPL management: pic.twitter.com/qYSd20asxk
— Sagar (@sagarcasm) April 15, 2022