ఐపీఎల్లో దాదాపు పదిహేనేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఆ టీమ్ ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కప్‌ను ముద్దాడలేకపోయింది. ఈ నేపథ్యంలో ఒక మాజీ ప్లేయర్ కోహ్లీకి సలహా ఇచ్చాడు. విరాట్ ఇకనైనా ఆర్సీబీని వదిలేయాని అతడు సూచించాడు.
విరాట్ కోహ్లీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్ల లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో ఉండే ప్లేయర్. టీమిండియా తరఫున ఎన్నో ఘనతలు సాధించాడు విరాట్. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ టీమ్‌లో స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. అతడు లేని భారత జట్టును ఊహించలేని స్థాయికి చేరుకున్నాడు. అయితే జాతీయ జట్టు తరఫున ఎన్నో విజయాలు సాధించిన విరాట్.. ఐపీఎల్లో మాత్రం చేదు అనుభవాలనే ఎదుర్కొంటున్నాడు. గత 16 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కోహ్లీ. కానీ ఈ జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేకపోయింది. ఐపీఎల్ పదహారో సీజన్లో కూడా ప్లేఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించింది. ఒక ప్లేయర్‌గా కోహ్లీ పరుగుల వర్షం కురిపిస్తూ ఆర్సీబీ గెలుపు కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆ జట్టు మాత్రం కప్ నెగ్గలేకపోతోంది. ఒకట్రెండు సీజన్లను మినహాయిస్తే దాదాపు అన్ని సీజన్లలోనూ ఆర్సీబీ తరఫున అత్యుత్తమ ప్రతిభను కనబర్చాడు విరాట్ కోహ్లీ.
ఆర్సీబీ కప్ రేసు నుంచి నిష్క్రమించడానికి చాలా కారణాలు ఉన్నాయి. కోహ్లీపై టీమ్ మేనేజ్మెంట్ అతిగా ఆధారపడటం, రెగ్యులర్‌గా మంచి ప్లేయర్లను ఆడించకపోవడం, కొన్నేళ్లపాటు ఆటగాళ్లను కొనసాగిస్తూ సరైన కూర్పును సిద్ధం చేసుకోకపోవడం, పేస్ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ తప్ప మరో స్టార్ బౌలర్ లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏదేమైనా కోహ్లీ శ్రమ మాత్రం వృథాగా పోతోంది. అతడు ఎంత పోరాడినా ఆర్సీబీ కప్ వేటలో వెనుక పడుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ స్టార్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ విరాట్‌కు ఒక సూచన చేశాడు. కోహ్లీ ఇక ఆర్సీబీని వదిలేసే టైమ్ వచ్చిందని.. అతడు వేరే ఫ్రాంచైజీకి మారాలని సలహా ఇచ్చాడు పీటర్సన్. కోహ్లీ ఆర్సీబీని వీడి సొంత నగరానికి షిఫ్ట్ అవ్వాలంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాలని సూచించాడు. మరి.. కోహ్లీ ఆర్సీబీని వీడాలంటూ పీటర్సన్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli to Delhi Capitals, Yes or No? pic.twitter.com/G76ZNzgfBy
— CricTracker (@Cricketracker) May 22, 2023