ఐపీఎల్ 2023 లో మొదట నిష్క్రమించిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. చెత్త ప్రదర్శన చేస్తూ అందరి నుంచి విమర్శలు మూటకట్టుకుంది. అయితే మా వరుస ఓటములకు అతనే కారణం అంటూ ఒక ప్లేయర్ మీద అసంతృప్తి వ్యక్తం చేసాడు ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్
అనుకోని సంఘటనలు జరగడంలో ఐపీఎల్ ముందు వరుసలో ఉంటుంది. బాగా ఆడతాడనుకున్న ప్లేయర్లు అట్టర్ ప్లాప్ అవ్వడం, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్లేయర్లు మంచి ప్రదర్శన చేయడం ప్రతి ఐపీఎల్ లో కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఈ ఐపీఎల్ లో అలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ఈ లిస్టులో ప్రధమ వరుసలో ఉంటాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ బ్యాటర్ పృధ్వి షా. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ అసంతృప్తి వ్యక్తం చేసాడు.
ఐపీఎల్ 2023 లో మొదట నిష్క్రమించిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. చెత్త ప్రదర్శన చేస్తూ అందరి నుంచి విమర్శలు మూటకట్టుకుంది. 13 మ్యాచుల్లో కేవలం 5 మ్యాచులోనే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండవ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా మొదటి రెండు మ్యాచుల్లో ఢిల్లీ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం గమనార్హం. అయితే ఆ తర్వాత క్రమంగా పుంజుకొని 5 మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో గెలిచినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా ఓపెనర్ పృధ్వి షా.. మొదటి 6 మ్యాచుల్లో 47 పరుగులే చేయడం జట్టు విజయావకాశాలు మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఇక ఎప్పుడైతే పృధ్వి షా ని జట్టులోనుంచి తప్పించారో అప్పటినుంచి ఢిల్లీ విజయాల బాట పట్టింది.
ఐపీఎల్ 2023 లో పృధ్వి షా ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడు. టోర్నీ ముందు ఢిల్లీ హెడ్ కోచ్ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు పృధ్వి షా అందరికన్నా.. దారుణంగా ఆడడం విశేషం. ఈ నేపథ్యంలో వాట్సన్ షా గురించి మాట్లాడుతూ.. “అతను వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు ఇస్తూ వచ్చాం. అయితే అది మా టీమ్‌ని తీవ్రంగా దెబ్బ తీసింది. ఇప్పుడే కాదు, గత కొన్నేళ్లుగా పృథ్వీ షా ఇలాగే నిలకడలేమితో ఆడుతున్నాడు. కొన్ని మ్యాచులు పక్కనబెట్టాక అతనికి సీరియస్‌నెస్ వచ్చింది..సత్తా ఎంత ఉన్నా, బాగా ఆడాలి? పరుగులు చేయాలనే కసి లేకపోతే నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకుంటూ ఉంటారు. పృథ్వీ షా విషయంలో జరుగుతోంది అదే. అతనికి పరుగులు చేయాలనే ఆకలి లేదు..’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్. మరి వాట్సన్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.