ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.ఈ మ్యాచులో చాలా రోజుల తర్వాత పృథ్వి షా కంబ్యాక్ ఇచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచులో చాలా రోజుల తర్వాత పృద్వి షా ఢిల్లీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. పంజాబ్ కి కీలకమైన మ్యాచులో స్టార్ పేసర్ జట్టులోకి వచ్చాడు. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు పృద్వి షా, వార్నర్ ఇద్దరూ కూడా ఎటాకింగ్ చేస్తూ స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టింనుంచగా.. చివర్లో రూసో చెలరేగి మెరుపు అర్ధ సెంచరీ చేసాడు. ఈ మ్యాచులో రోజుల తర్వాత పృథ్వి షా కంబ్యాక్ ఇచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఐపీఎల్ 2023 లో పృథ్వి షా దారుణమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. టీంఇండియా ఫ్యూచర్ స్టార్ గా పేరొందిన పృథ్వి షా.. చెత్త ఆటతీరుతో విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే ఢిల్లీ ఇక ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించగానే జట్టులో స్థానం సంపాదించిన పృథ్వి షా తన మునుపటి ఆటతీరుని చూపించాడు. 38 బంతుల్లో 54 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే దీని వెనుక ధోని హస్తం ఉందని తెలుస్తుంది. ఈ రెండు జట్ల మధ్య చివరిసారిగా జరిగిన మ్యాచ్ సందర్భంగా పృథ్వి షాకి ధోని సలహాలిస్తూ కనిపించాడు. ఆ సలహాలవల్లే పృథ్వి షా ఇప్పుడు రాణిస్తున్నాడు అనే ప్రతిపాదన కూడా ఉంది. మరి ధోని ఇచ్చిన ఈ సలహాలు వలన పృథ్వి షా కంబ్యాక్ ఇవ్వడం మీకెలా అనిపించాయి కామెంట్ల రూపంలో తెలపండి.