ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది.ఢిల్లీలోని ప్రతి ఆటగాడు, ముఖ్యంగా రూసో చెలరేగి మెరుపు అర్ధ సెంచరీ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఈ క్రమంలో వార్నర్ ఐపీల్ లో ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ లో భాగంగా ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచులో చాలా రోజుల తర్వాత పృద్వి షా ఢిల్లీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. పంజాబ్ కి కీలకమైన మ్యాచులో స్టార్ పేసర్ జట్టులోకి వచ్చాడు. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఓపెనర్లు పృద్వి షా, వార్నర్ ఇద్దరూ కూడా ఎటాకింగ్ చేస్తూ స్కోర్ బోర్డు ని పరుగులు పెట్టించారు. ముఖ్యంగా వార్నర్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఐపీల్ లో ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్ 2023 లో వార్నర్ తన స్థాయిలో ఆడలేకపోతున్న పర్వాలేదనిపించే ప్రదర్శన చేస్తున్నాడు. ఈ టోర్నీలో వేగంగా ఆడడంలో విఫలమైన వార్నర్.. యావరేజ్ మాత్రం బాగానే ఉంది. ఇక ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచులో ఒకే టీంపై అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా వార్నర్ నిలిచాడు. వార్నర్ పంజాబ్ కింగ్స్ పై ఇప్పటివరకు 1105 పరుగులు చేసాడు. ఐపీఎల్ లో ఇలా ఒకే టీంపై ఇన్ని పరుగులు సాధించిన రికార్డ్ వార్నర్ పేరు మీదే ఉండడం విశేషం.
ఇదివరకే వార్నర్ కేకేఆర్ మీద 1075 పరుగులు చేసాడు. తాజాగా తన రికార్డుని తానే బ్రేక్ చేసుకున్నాడు. ఈ లిస్టులో శిఖర్ ధావన్ చెన్నై మీద 1057 పరుగులు, రోహిత్ శర్మ కేకేఆర్ మీద 1040 పరుగులు, విరాట్ కోహ్లీ ఢిల్లీ మీద 1030 పరుగులు చేశారు. పంజాబ్ మీద ఉన్న మంచి రికార్డ్ ని కొనసాగిస్తూ ఈ మ్యాచులో కూడా వార్నర్ 46 పరుగులు చేసాడు. ఢిల్లీలోని ప్రతి ఆటగాడు, ముఖ్యంగా రూసో చెలరేగి మెరుపు అర్ధ సెంచరీ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరి వార్నర్ సాధించిన ఈ అరుదైన రికార్డ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.