ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి గెలుపును నమోదు చేసుకుంది. ఈ సీజన్లో తొలి నాలుగు వరుస ఓటముల తర్వాత బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఒక కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. రాయుడు పట్టిన ఆ క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిలకడలేమి బ్యాటింగ్‌తో ఈ సీజన్లో సతమతమవుతున్నా.. స్టన్నింగ్ క్యాచ్‌తో టాక్ ఆఫ్‌ది క్రికెట్ టౌన్ అయ్యాడు రాయుడు. గాల్లో పక్షిలా ఎగురుతూ.. ఒంటిచేత్తో ఒక అద్భుతమై క్యాచ్ అందుకున్నాడు. రాయుడు పట్టిన క్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ గొప్ప క్యాచ్‌గా నిలిచిపోనుంది.
ఆర్సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా రవీంద్ర జడేజా వేసిన 16వ ఓవర్ నాలుగో బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్ సిల్లీ మిడాఫ్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి గాల్లోకి లేవగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అంబటి రాయుడు తన కుడివైపుకు డైవ్ చేస్తూ.. గాల్లో ఒంటి చేత్తో అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు. రాయుడు స్టన్నింగ్ క్యాచ్‌కు మైదానంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు, కామెంటేటర్లు అవాక్కయ్యారు. వాటే సెన్సేషనల్ క్యాచ్ అంటూ కామెంటేటర్లు రాయుడిపై పొగడ్తల వర్షం కురిపించారు.అలాగే.. రాయుడిలోని ఈ త్రీడీ డైమెన్షన్‌ను చూడండి అంటూ హిందీ కామెంటేటర్లు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో టీమిండియాలో రాయుడి బదులు విజయ్ శంకర్‌ను సెలెక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేస్తూ.. శంకర్‌ను త్రీ డైమెన్షన్ ప్లేయర్ అంటూ పేర్కొన్నాడు. దీంతో సెలెక్టర్లపై తన అంసృత్తిని వ్యక్తం చేస్తూ.. మ్యాచ్ చూసేందుకు తీడీ కళ్లాద్దాలు ఆర్డర్ ఇచ్చినట్లు రాయుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అప్పట్లో ఈ అంశం సంచలనంగా మారింది. ఇప్పుడు రాయుడు స్టన్నింగ్ క్యాచ్ చూసి అందరూ ముక్కన వేలేసుకున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ కోసం ధోని మాస్టర్ ప్లాన్! వర్క్ అవుట్ అయింది..
Rayudu what a catch 🤯 #CSKvRCB pic.twitter.com/S5xw6viacM
— ᴀ (@aayusht1802) April 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.