ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ ఓపెనర్ అజింక్యా రహానే ఏకంగా 9 సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇందులో కొన్ని అంపైర్ తప్పుడు నిర్ణయాలు ఉండగా.. ఇంకొన్ని ప్రత్యర్థి జట్టు తప్పిదాలు ఉన్నాయి. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో అయితే హైడ్రామా జరిగింది.
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే తడబడ్డ రహానే.. కీపర్ క్యాచ్‌గా అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ రహానే రివ్యూ తీసుకుని బతికిపోయాడు. రెండో బంతికి ఎల్బీగా అంపైర్ అవుట్ ఇస్తే.. మళ్లీ రివ్యూ తీసుకోవడంతో అది కూడా నాటౌట్‌గా తేలింది. ఇక మూడో బంతికి రహానే బ్యాట్‌కు బంతి తగిలి కీపర్ పంత్ చేతుల్లో పడింది. ఈ విషయాన్ని బౌలర్ కానీ, పంత్ కానీ గమనించలేదు. ఎవరూ స్పందించకపోవడంతో అంపైర్ కూడా మౌనంగా ఉండిపోయాడు. తర్వాత రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకి పంత్ చేతిలో పడినట్లుగా తేలింది. ఇలా రెండు నాటౌట్లకు హడావిడి చేసిన ఢిల్లీ ఆటగాళ్లు.. నిజంగానే అవుట్ అయితే మాత్రం పట్టించుకోలేదు.ఇక ఠాకూర్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి కూడా రహానే వికెట్ల ముందు దొరకగా.. అంపైర్ నాటౌటిచ్చాడు. ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి రహానే రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగా.. వెకంటేశ్ అయ్యర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి కూడా క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కాడు. ఐదో ఓవర్ తొలి బంతికి రహానే ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను ఖలీల్ అందుకోలేకపోయాడు. కానీ ఆ ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇన్ని లైఫ్స్ లభించినా రహానే పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఒక దశలో రహానే అవుట్ అవ్వాలని కూడా కేకేఆర్ ఫ్యాన్స్ కోరుకున్నారు. కొత్త బ్యాటర్ వస్తే కనీసం ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తాడని వారు భావించారు. మరి రహానేకు దొరికిన లైఫ్‌లపై, బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కృనాల్ పాండ్యా చేసిన ఆ ఒక్క తప్పే లక్నో కొంపముంచిందా?
#IPL2022 | #KKR‘s #AjinkyaRahane saved after umpire gives him out TWICE
Writes Karen Noronha (@Karen_noronha09)
Read here: https://t.co/WZJB43bH4x pic.twitter.com/qurAlpSkiS
— DNA (@dna) April 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.