డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడని అందరికీ తెలుసు. కానీ గాయం చేతి వెలికి గాయమైన బ్యాటింగ్ కొనసాగించిన సంగతి కొంతమందికే తెలుసు. ఇదే విషయమై రహానే భార్య మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
“అజింక్య రహానే” ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ పేరే వినిపిస్తుంది. దానికి కారణం వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ లో ఆడిన గ్రేట్ ఇన్నింగ్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ వైపు సహచర బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కడుతూ ఉంటే రహానే మాత్రం గ్రీజ్ లో పాతుకుపోయాడు. రహానే చూపించిన పట్టుదలకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 57/ 3 పరుగుల వద్ద బ్యాటింగ్ కి వచ్చిన అజింక్య.. 89 పరుగులు చేసి టీమిండియాని ఫాలో ఆన్ నుంచి కాపాడాడు. దాదాపు 500 రోజుల తర్వాత జట్టులోకి రీ- ఎంట్రీ ఇచ్చిన రహానే.. ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచులో గాయాన్ని లెక్క చేయకుండా జట్టు కోసం చూపించిన డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇదే విషయమై రహానే భార్య మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో రహానే గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడని అందరికీ తెలుసు. కానీ గాయం చేతి వెలికి గాయమైన బ్యాటింగ్ కొనసాగించిన సంగతి కొంతమందికే తెలుసు. వ్యక్తిగత స్కోర్ 17 పరుగులు వద్ద ఉన్న సమయంలో ప్యాట్ కమ్మిన్స్ విసిరినా బంతి రహానే వేళ్లకు గట్టిగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన రహానే బ్యాటింగ్ చేయడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ రోజు వరకు కష్టంగా బ్యాటింగ్ చేసినప్పటికీ మరుసటి రోజు నొప్పి తగ్గకపోయిన బ్యాటింగ్ కి వచ్చి ఓపిగ్గా బ్యాటింగ్ చేసాడు. ఆస్ట్రేలియా బౌలర్ల నుంచి బుల్లెట్ లా దూసుకొస్తున్న బంతులను చాలా సార్లు రహానేని గాయపరిచినా.. బెదురు లేకుండా బ్యాటింగ్ చేసాడు. ఇది చూసి తట్టులేకపోతున్న రహానే భార్య.. ఎమోషనల్ పోస్ట్ తో అందరి హృదయాలను కదిలించింది.
“పలు మార్లు వెలికి గాయమైనా స్కానింగ్ చేసుకోవడానికి నిరాకరించి పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. ఆట పట్ల మీకున్న అంకిత భావానికి హ్యాట్సాఫ్. మీ నిస్వార్ధత, సంకల్ప బంధం చాలా గొప్పది. ఈ రెండిటినీ జోడించి ఈ రోజు మీరు బ్యాటింగ్ చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. జట్టుని గెలిపించడానికి మీ స్పిరిట్ కి నేను గౌరవిస్తున్నా. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా” అని చెప్పుకొచ్చింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఆధిక్యాన్ని 369 పరుగులకి పెంచుకుంది. మరి రహానే భార్య చేసిన ఎమోషనల్ పోస్ట్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.