టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రితికా కోసం ఏకంగా సముద్రంలోకి దూకేశాడు. ఆ తర్వాత ఏమైందంటే..!
భారత జట్టు సారథి రోహిత్ శర్మకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోందనే చెప్పాలి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు కప్ అందించడంలో ఫెయిలైన హిట్‌మ్యాన్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియాకు టైటిల్ అందించడంలోనూ విఫలమయ్యాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఓటమి రోహిత్‌పై అంతగా ప్రభావం చూపలేదు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ పరాభవం ఎఫెక్ట్ మాత్రం అతడిపై గట్టిగానే పడింది. టెస్టుల్లో వరల్డ్ కప్ లాంటి డబ్ల్యూటీసీ ఫైనల్లో వరుసగా రెండో ఓటమిని భారత అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఓటమికి రోహిత్ శర్మ బాధ్యత తీసుకోవాలని.. అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. సారథ్యాన్ని వదిలి ఆటపై దృష్టి పెట్టాలని హిట్‌మ్యాన్‌కు టీమిండియా ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఇకపోతే, డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసి ఐదు రోజులు కావొస్తున్నా భారత క్రికెటర్లలో చాలా మంది ఇంకా స్వదేశానికి చేరుకోలేదు.
కొందరు టీమిండియా స్టార్లు సైలెంట్‌గా అటు నుంచి అటే మాల్దీవుల్లో వాలిపోయారు. మరో నెల రోజుల వరకు మ్యాచ్‌లు లేకపోవడంతో సముద్రపు ఒడ్డున బీచ్‌ల్లో ఎంజాయ్ చేస్తున్నారు క్రికెటర్స్. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమితో భారీగా విమర్శలు రావడంతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా మాత్రం హాలీడేస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పొరపాటున తన ఫోన్ సముద్రంలో పడిపోతే రోహిత్ వెంటనే దూకి, దాన్ని తీసుకొచ్చాడని ఇన్‌స్టాలో ఒక పోస్టు ద్వారా తెలిపింది రితికా. దీని పైనా కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. భార్య ఫోన్ కోసం ప్రాణాలకు తెగించిన రోహిత్.. ఐసీసీ టోర్నీల్లో ఇంత సాహసం చూపించి ఉంటే భారత్‌కు రెండు కప్స్ (ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2022, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2023) వచ్చేవని ట్రోల్ చేస్తున్నారు.
Rohit Sharma never fails to impress.#RohitSharma pic.twitter.com/roN6eVcLwo
— CricTracker (@Cricketracker) June 16, 2023