ఎప్పుడో నానా తిప్పలు పడి హీరోతోనో.. హీరోయిన్‌తోనో.. లేక ఇతర నటులతో తీసుకున్న ఫొటోలను పబ్లిసిటీ కోసం వాడేస్తుంటారు కొందరు. ఇంకా కొందరు సినిమా వాళ్లు కనిపిస్తే చాలు...
సినిమా వాళ్లంటే సాధారణ జనానికి నిజంగా చెప్పాలంటే ఓ రకమైన పిచ్చి. మాకు సినిమా వాళ్లు బాగా తెలుసు అని అబద్దాలు చెప్పుకుని తిరిగే వాళ్లు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎప్పుడో నానా తిప్పలు పడి హీరోతోనో.. హీరోయిన్‌తోనో.. లేక ఇతర నటులతో తీసుకున్న ఫొటోలను పబ్లిసిటీ కోసం వాడేస్తుంటారు కొందరు. ఇంకా కొందరు సినిమా వాళ్లు కనిపిస్తే చాలు వారితో ఫొటోలు దిగాలని ఉబలాటపడిపోతుంటారు. ఈ నేపథ్యంలోనే సెలెబ్రిటీలను ఇబ్బందులకు సైతం గురి చేస్తుంటారు. తాజాగా, ప్రముఖ సీనియర్ నటి రాధిక విషయంలోనూ ఇదే జరిగింది. తిరుమల దర్శనానికి వెళ్లిన ఆమెతో ఓ మహిళ ఫొటో దిగటానికి ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలోనే రాధిక ఆగ్రహానికి గురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే… నటి రాధిక కొద్దిరోజుల క్రితం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్లారు. దేవుడ్ని దర్శించుకున్న తర్వాత ఆమె కొండపై నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ మహిళ రాధిక దగ్గరకు వచ్చింది. ఆ మహిళ రాధిక భుజంపై చెయ్యివేసింది. ఫొటో కోసం రాధికను ఆగమని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే, మహిళ చెయ్యి మీద పడగానే రాధిక షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు.
కోపంతో కళ్లు పెద్దవి చేసి మహిళ వైపు చూశారు. కొన్ని క్షణాలు మాత్రమే.. వెంటనే అటు వైపు తిరిగారు. రాధిక రియాక్షన్‌తో సదరు మహిళ భయపడిపోయింది. రాధికకు సారీ చెప్పి వెనక్కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు గ్రూపులుగా విడిపోయిన నెటిజన్లు.. కొంతమంది రాధికకు సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే.. మరికొందరు సదరు మహిళకు సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.