ఐపీఎల్ 2022లో సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ అందరికంటే ముందు ప్లేఆఫ్స్‌కు చేరింది. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జీటీ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 18 పాయింట్లతో సగర్వంగా ప్లేఆఫ్స్‌కు చేరింది. ఈ ఏడాదితోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ మెగా వేలం తర్వాత ఒక సాధారణ జట్టులా కనిపించింది. కానీ.. టోర్నీ గడుస్తున్న కొద్ది సూపర్ స్ట్రాంగ్‌గా మారుతోంది. నిజానికి గుజరాత్ పేరులోనే ఆ బలం ఉందని అంటున్నారు ఫ్యాన్స్. తమ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరిందనే సంతోషంతో పాటు ఒక విషయంలో వారు భయం వ్యక్తం చేస్తున్నారు.
2016లో సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్ల నిషేధం విధించినప్పుడు.. గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్లు వారి స్థానంలో బరిలోకి దిగాయి. ఆ సీజన్‌లో గుజరాత్ లయన్స్ అంచనాలకు మించిరాణించింది. ఆ జట్టు కూడా 18 పాయింట్ల ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. కానీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడింది. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కూడా గుజరాత్ లయన్స్ లానే ప్లేఆఫ్స్‌కు చేరింది. దీంతో ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్‌లోనే ఇంటి దారి పడుతుందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ పేరు బలంతో లీగ్ దశలో అదరగొట్టి.. కీలమైన ప్లేఆఫ్స్‌లో చేతులేస్తుందేమో అని భయం పట్టుకుంది గుజరాత్ ఫ్యాన్స్‌కు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.ఇదీ చదవండి: Shubman Gill: 13 ఏళ్ల క్రితం సచిన్ ఆడిన ఇన్నింగ్సే మళ్లీ శుభ్‌మన్ ఆడాడు!
Gujarat Titans make a fairytale entry into IPL playoffs
The debutants have done it with two league games to play and after all the criticism around their auction picks
READ: https://t.co/r3cjR7djOD#GujaratTitans #IPL2022 #IPL #GTvsLSG pic.twitter.com/5cjrwClyAP
— TOI Sports (@toisports) May 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.