ఐపీఎల్ 2022 సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. అన్ని జట్లు ప్రత్యేక క్యాంపులు పెట్టి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాయి. ఈ నేపథ్యంలో ముంబయిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని తాజ్ మహల్ ప్యాలెస్ అనే 5 స్టార్ హోటల్ బయట పార్క్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై దాడి జరిగింది. మహారాష్ట్ర నవ నిర్మాణసేన పార్టీకి చెందిన కొందరు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడున్న వాటిలో ఒక బస్సు అద్దాలు కూడా పగలగొట్టారు.
ఇదీ చదవండి: SRH క్యాంపులో అడుగుపెట్టిన కేన్ విలియమ్సన్. కప్ ముఖ్యం బిగులు!
దాడిపై సమాచారం అందుకున్న కొలాబా పీఎస్ పోలీసులు వెంటనే హోటల్ కు చేరుకున్నారు. మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో నవ నిర్మాణసేన పార్టీకి చెందిన రవాణా విభాగం వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 143, 147, 149, 427 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ దాడి జరిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Delhi Capital IPL team parked bus allegedly attacked#IPL2022pic.twitter.com/hzmdb60yXm
— Himalayan Guy (@RealHimalayaGuy) March 16, 2022