‘ఐపీఎల్ 2022’ సందడి మొదలు కాబోతోంది. కొన్ని నెలల ముందే ఆ హీట్ కనిపిస్తోంది. ఏ టీమ్ ఎవరిని రిటైన్ చేసుకుంది? కొత్త టీమ్లు ఎవరిని తీసుకుంటాయి? ఆక్షన్ లో ఎవరు ఎంత ధర పలుకుతారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో అభిమానులు ఎంతో బిజీగా ఉన్నారు. అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల వివరాలు అందించిన విషయం తెలిసిందే. అయితే చెన్నై మాత్రం ఈసారి సురేశ్ రైనాకు షాకిచ్చింది. రిటైన్ లిస్ట్ లో రైనా పేరు లేదు. అయితే అంతకన్నా ముఖ్యమైన ప్లేయర్లను తీసుకునేందుకు రైనాను త్యాగం చేశారు అని కొన్ని రోజులు అనుకున్నారు. కచ్చితంగా వేలంలో రైనాను దక్కించుకుంటారులే అని చెన్నై అభిమానులు సర్ది చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఈ వార్త షాకిస్తుందనే చెప్పాలి.
Happy Birthday @imjadeja 🤩 stay happy forever 🧿@ImRaina pic.twitter.com/KAE4N4UbfM
— Navi (@NavamiS1) December 5, 2021
ఎందుకంటే వేలంలోనూ సురేశ్ రైనాను తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఆసక్తిగా లేదని తెలుస్తోంది. ఆక్షన్ లోనూ సురేశ్ రైనాను తిరిగి తీసుకునేలా కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది. అందుకు కారణాలు కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. రైనా వయసు మూడు పదులు దాటడం.. గత సీజన్ లోనూ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకపోవడం కారణాలుగా తెలుస్తోంది. అయితే ఇంతకాలం టీమ్ ను నమ్ముకుని అలుపెరగని పోరాటం చేసిన సురేశ్ రైనాను ఇలా మధ్యలో ఒదిలించుకోవాలని చెన్నై చూస్తోందని వార్తలు విని అభిమానులు ఫైర్ అవుతున్నారు.
Missing CHINNA THALA -RAINA in yellove 💛😢💥😍…. pic.twitter.com/bqFrMh0lui
— Tapa Swini (@tapa_23) December 7, 2021
మరోవైపు సురేశ్ రైనాను అహ్మదాబాద్ వేలంలో తీసుకుంటుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. రైనా వల్ల చెన్నై కంటే అహ్మదాబాద్ కే ఎక్కువ లాభం ఉందని.. అందుకోసం వాళ్లు ఎంతైనా పాడుతారని తెలుస్తోంది. అందుకని రిస్క్ తీసుకోకూడదనే రైనా విషయంలో చెన్నై సైలెంట్ అయ్యిందనేది ఒక వర్గం వాదన. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే ఆక్షన్ వరకు ఆగాల్సిందే. ధోనీని ఎలాగైతే రిటైన్ చేసుకుందో.. అలాగే రైనాను సైతం వేలంలో కొంటుంది అంటూ అభిమానులు భావిస్తున్నారు. సురైశ్ రైనా ఐపీఎల్ కెరీర్ ముగిసినట్లేనా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Super Birthday to the Super King who is full of 💛&🔥 Inside out!#ChinnaThala #WhistlePodu 🦁 pic.twitter.com/HWeYbZ0YHL
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) November 27, 2021