ఐపీఎల్ 2022 తుది పోరు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ విజేత ఎవరో తేలిపోనుంది. సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్-హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ట్రోఫీ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ రాత్రి 8 గంటలకు అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్.. తన సొంత రాష్ట్రంలో ఈ మ్యాచ్ ఆడబోతోంది.
తొలి సీజన్‌లోనే ఫైనల్స్ చేరిన గుజరాత్.. లీగ్ దశలో తిరుగులేని విజయాలను అందుకుంది. 14 మ్యాచ్‌లల్లో పదింట గెలిచింది. తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా తన జట్టును ఇప్పటి వరకు విజయవంతం నడిపించాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి బలమైన జట్లను మట్టి కరిపించింది. ఈ ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సాధించగలిగితే- ఓ కొత్త చరిత్ర లిఖించినట్టవుతుంది. అడుగు పెట్టిన తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా ఆవిర్భవించిన జట్టవుతుంది. ఈ సీజన్‌లో కొత్త జట్టు కప్‌ను కట్టినట్టవుతుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.2008లో ఐపీఎల్ ఆరంభమైన తరువాత ఛాంపియన్‌గా అవతరించింది. ఇటీవలే కన్నుమూసిన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్- సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి సీజన్ విన్నర్‌గా నిలిచింది. దీంతో రెండో కప్పు కోసం గుజరాత్‌తో పోటీ పడనుంది. కాగా- ఫైనల్ మ్యాచ్ విజేతకు దిమ్మతిరిగే రేంజ్‌లో ప్రైజ్ మనీ దక్కబోతోంది. ఛాంపియన్‌గా ఆవిర్భవించిన జట్టుకు లభించే ప్రైజ్ మనీ మొత్తం రూ.20 కోట్లు. ఇక రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. వచ్చే ఏడాదికి ఈ ప్రైజ్‌మనీ మొత్తాన్ని మరింత పెంచేలా బీసీసీఐ ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం రూ.23 లేదా రూ.25 కోట్లకు పెంచవచ్చని సమాచారం.
మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. మూడో స్థానంలో నిలిచిన ఆర్సీబీకి రూ.7 కోట్లు.. నాలుగో స్థానంలో నిలిచిన లక్నోకు రూ.6.5 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ లభించనుంది. కాగా ఈ మ్యాచ్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఆయన చేతులు మీదనే విజేతకు ట్రోఫీ అందజేయనున్నట్లు సమాచారం. కాగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే క్వాలిఫైయర్ 1లో రాజస్థాన్‌ను గుజరాత్ టైటాన్స్ ఓడించింది. దీంతో గుజరాత్ టైటాన్స్ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. పైగా అహ్మాదాబాద్ వారికి హోం గ్రౌండ్ కావడం అదనపు బలం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Virat Kohli: కప్పుతో RCB టీమ్ సంబరాలు! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫన్నీ వీడియో
HUGE Security layer deployed as #PMModi & #AmitShah to attend GT vs RR #IPLFinal
The #IPL2022Final will be played between #GujaratTitans and #RajasthanRoyals at Narendra Modi Stadium in Ahmedabad on Sunday evening.https://t.co/i8EytUnVzb
— Organiser Weekly (@eOrganiser) May 29, 2022