ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా.. ఆఖరి బంతి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పంజాబ్- రాజస్థాన్ మ్యాచ్ తరహాలోనే పంజాబ్- హైదరాబాద్ మ్యాచ్ కూడా సాగింది. ఆఖరి బంతి వరకు ఆ ఉత్కంఠ కొనసాగింది. ఈ సీజన్ మొత్తంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ ఒక్క మ్యాచ్‌లో కూడా సమిష్టి కృషి, టీమ్ పెర్ఫార్మెన్స్ కనిపంచలేదు. పంజాబ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ పరంగా రాణించినా.. బ్యాటింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న ఆరంజ్ ఆర్మీ మరో పరాజయంతో ఇంకాస్త ఎక్కువ ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ఇంతటి చెత్త ప్రదర్శన ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 125 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోవడంతో అభిమానుల అసహనం రెట్టింపైంది. జేసన్ హోల్డర్, సాహా మినహా ఏ బ్యాట్స్‌మన్ కూడా ప్రభావం చూపలేకపోయారు. ముగ్గురు బౌల్డ్, ముగ్గురు క్యాచ్‌లు కావడం పట్ల వారి బ్యాటింగ్ మరీ చెత్తగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 125 పరుగులు చేసింది. వారిలో హైఎస్ట్ స్కోర్ మర్కరం(27) ఒక్కటే. అలాంటి సమయంలో ఎంతో నిలకడగా బ్యాటింగ్ చేసి విజయాన్ని ఖాతాలో వేసుకోవాల్సింది పోయి.. ఒక్క సరైన భాగస్వామ్యం నెలకొల్పలేకపోయారు.
మనసులు గెలిచిన హోల్డర్
జేసన్ హోల్డర్ మొదటి నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు మంచి బలం. ఈ మ్యాచ్‌లో కూడా అదే రుజువైంది. బౌలింగ్, బ్యాటింగ్ రెంటిలోనూ తన ఉత్తమ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్‌ని 125కే కట్టడి చేయడంలో హోల్డర్ పాత్ర ఎంతో ఉంది. 4 ఓవర్లలో కేవలం 4.8 ఎకానమీతో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హుడా వంటి కీలక వికెట్లు తీసిన హోల్డర్ తర్వాత బ్యాట్‌తోనూ అంతే రాణించాడు. వార్నర్, విలియమ్సన్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్ వంటి వారు విఫలమైన తరుణంలో మ్యాచ్ భారాన్ని భుజాన వేసుకుని బ్యాటింగ్ చేశాడు. 29 బంతుల్లో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ 5 సిక్సులతో విరుచుకుపడ్డాడు. కానీ, మ్యాచ్ మాత్రం గెలిపించలేకపోయాడు. లాస్ట్‌లో వేసిన లోఫుల్‌టాస్‌ను సిక్సుగా మలిచి ఉంటే కచ్చితంగా సూపర్ ఓవర్ అయ్యేది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో మాత్రం జేసన్ హోల్డర్ మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు అభిమానులు.
All Sixes hitted today by Jason Holder , almost saved SRH from another defeat 🔥 pic.twitter.com/gB1zakkYQH
— Mranank (@RunMachine_18) September 25, 2021