కరోనా మహమ్మారి దేశాన్ని కమ్మేసింది. గడిచిన ఈ కొన్ని నెలల కాలం మానవాళికి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఇక సెకండ్ వేవ్ ఉదృతి నుండి ఇండియా ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు రోజువారీగా నమోదు అవుతున్న కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఇదే విధంగా రికవరీ రేటు కూడా పెరిగింది. కానీ.., కరోనా నుండి కోలుకున్న వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడానికి మాత్రం నెలల సమయం పడుతోంది. ముఖ్యంగా.. ఇలాంటి వారిలో శక్తి తక్కువగా ఉంటుంది. నీరసంగా అనిపించడం, అలసట రావడం, గుండె దడగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలా ఉన్నప్పుడు శరీరానికి శక్తిని ఇచ్చే మంచి ఆహరం తీసుకోవాలి. మరి అవేంటివో ఇప్పుడు తెలుసుకుందాం. నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష శరీరానికి చాలా మంచిది. ముఖ్యంగా నానబెట్టిన బాదంలో లిపేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వులను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక రాగులలో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రాగి దోశను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తినడం వలన బలహీనమైన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. డయాబెటిక్ పేషంట్స్ కి అయితే ఇది ఇంకా మంచి డైట్.
ఇక అన్నం వండిన గంజిని తప్పక తీసుకోండి. గంజిలో కాల్షియం, భాస్వరం ఉన్నందున ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఐరన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎర్రరక్త కణాలను పెంచడంలోనూ ఇది సహయపడుతుంది. మీకు ఒకవేళ గంజి తాగడం అలవాటు లేకపోయినా.., పూర్తిగా కోలుకునే వరకు మాత్రం తప్పక తీసుకోండి.ఇక ముఖ్యమైన ఆహార పదార్ధం బెల్లం. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి అధికంగా ఉంటాయి. నెయ్యి కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ ఎ, ఇ, డిలు సమృద్దిగా ఉంటాయి. అలాగే ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహయపడే కాల్షియం, విటమిన్ కె కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి పాలల్లో బెల్లం వేసుకుని తాగండి. ఒకవేళ అలా ఇష్టం లేకుంటే.. బెల్లంతో చేసిన ఏవైనా స్వీట్స్ తీసుకున్నా మంచిదే. ఇక వెజిటేబుల్ కిచిడి. ఇది పూర్తిగా ప్రోటీన్ ఫ్యాక్ట్ డైట్. ఇందులో అన్నీ రకాల కూరగాయలు ఉండటం వల్ల శరీరానికి తగినంత ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనిలో నెయ్యి కలిపి చేస్తే ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా అందిస్తాయి. ఈ వెజిటేబుల్ కిచిడి తరుచుగా తీసుకునేందుకు ప్రయత్నించండి. ఇక నాన్ వెజ్ లో సమపాలల్లో ఏది తిన్నా మంచిదే. ఇవన్నీ తీసుకుంటూ.., శరీరాన్ని హైడ్రేట్గా కానివ్వకుండా చూసుకోవాలి. దీని కోసం ఎక్కువగా నీరు తాగడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటివి చేయాలి. ఇవన్నీ కూడా మీకు ఆహారంగా తీసుకొగలిగితే కరోనా కారణంగా ఏర్పడ్డ నీరసం నుండి త్వరగా బయటపడవచ్చు. అలాగే.. ఒకవేళ మీరు ఆ మహమ్మారి నుండి బయటపడిన వారైతే మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.