ఈ మధ్య కాలంలో చాలామంది పిగ్మెంటేషన్ సమస్యతో బాధ పడుతున్నారు. దీనికి ముఖ్యమైన కారణం మన జీవన శైలి. మన లివర్ లో జరిగే మార్పుల వల్లనే మన చర్మం పై పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. లివర్ సిరోసిస్, కొలెస్ట్రాల్ పెరగడం.. లాంటి కారణాల వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. నిజానికి ఒక మనిషి లివర్ పనితనం చూడాలంటే అతని కళ్లు చూడాలి. ఎందుకంటే లివర్ కు సంబంధించిన దుష్ప్రభావాలన్నీ మన కళ్లలో కనిపిస్తాయి. లివర్ లో కలిగే అనారోగ్యానికి చాలా రకాల కారణాలుంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి మసాలాలు ఎక్కువగా తినడం, నూనె పదార్ధాలు ఎక్కువగా వాడటం.. వీటితో పాటు అతిగా భావోద్వేగాలకు లోనవ్వడం.
మనం ఎక్కువగా కోపానికి గురైనపుడు దాని దుష్ప్రభావం లివర్ పై పడుతుంది. దీంతో లివర్ పాడయ్యే అవకాశం ఉంది. అయితే, మన శరీరంలో గల అవయవాల్లో అత్యంత త్వరగా పునరుత్పత్తి అయ్యే లక్షణం ఉన్న అవయవం లివర్ ఒక్కటే. మన శరీరంలో ఏ అవయవమైనా సరే కొన్ని కణాల కలయికతో నిర్మించబడి ఉంటుంది. ఒక కణం యొక్క జీవిత కాలం ఇరవై ఒక్క రోజులు. ఆ 21 రోజుల తర్వాత ఆ కణం స్థానంలో కొత్త కణం పుట్టుకొస్తుంది. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఎప్పుడైతే ఆగిపోతుందో.. అంటే డెడ్ సెల్స్ రాలిపోయి,కొత్త సెల్స్ రావడం ఎప్పుడు ఆగిపోతుందో.. అప్పుడు మనిషి వయసైపోయినట్టు కనిపిస్తాడు. లివర్ కి ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆ ప్రభావం వల్ల ముఖం మీద మొటిమలు రావడం, పిగ్మెంటేషన్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
పిగ్మెంటేషన్ నుంచి బయట పడడానికి అన్నిటి కంటే ముందు మనం ప్రధానంగా చేయవలసింది కోపాన్ని తగ్గించుకోవడం. విపరీతంగా కోప్పడే తత్త్వం ఉన్న వారికి పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల కోపాన్ని నియంత్రించుకోవాలి. అందుకోసం యోగా, ధ్యానం లాంటివి చేయడం చాలా మంచిది. ఇవి క్రమం తప్పకుండా చేయడం వల్ల కోపాన్ని నియంత్రించుకోవచ్చు. అదే విధంగా, లివర్ ఆరోగ్యం కోసం కొత్తిమీర, పుదీనా చాలా బాగా ఉపయోగపడతాయి. దానిమ్మ, నేరేడు పండ్లను జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. పిగ్మెంటేషన్ ను తొలగించుకోవడానికి, లివర్ ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి..