బెల్లం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పెద్దలు చెబుతున్నారు. చిన్నప్పుడు చాలా మందికి బెల్లం బాగా తినే అలవాటు ఉండే ఉంటుంది. ప్రస్తుతం గజిబిజి జీవితం గడిపే వారు జీవనశైలి మారిన నేపథ్యంలో బెల్లం తగిన మోతాదులో తీసుకోలేకపోతున్నారు. బెల్లంలో ఉన్న ప్రత్యేక గుణాలు శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని పెద్దలు స్పష్టం చేస్తున్నారు. పేదవాడి చాక్లెట్‌గా బెల్లంను అభివర్ణిస్తారు. సహజమైన స్వీట్‌నర్ వెనుక నమ్మశక్యం కాని సైన్స్ ఉందని పెద్దలు చెబుతున్నారు.
బెల్లం తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో పెద్ద నగరాల్లో కాలుష్యం బాగా పెరిగిపోయింది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో గాలి కలుషితమవుతోంది. దీని వల్ల ప్రజలు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వైద్యులు, నిపుణులు బెల్లం తినాలని సూచిస్తున్నారు. తద్వారా శ్వాస మార్గంలో ఇబ్బందులు లేకుండా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు ఏర్పడకుండా బెల్లం అడ్డుకుంటుందని సూచిస్తున్నారు.
కాలుష్య కారక ప్రాంతాల్లో జీవిస్తున్న వారు బెల్లం తినడం వల్ల శ్వాసకోస వ్యాధుల బారి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. లైఫ్ స్టైల్‌ను కాస్త మార్చుకొని బెల్లాన్ని రోజూ తినడం అలవాటు చేసుకుంటే చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయని చెబుతున్నారు.
బెల్లం తినడం వల్ల లంగ్స్ ఆరోగ్యంగా మారుతాయి. అల్వియోలీలో చిక్కుకున్న కార్బన్ కణాలను తరిమేసే శక్తి బెల్లానికి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది బ్రోన్కైటిస్, శ్వాసలోపం, ఆస్తమా, ఇతర శ్వాస సంబంధిత సమస్యలకు తక్షణమే ఉపశమనం లబిస్తుందంటున్నారు. బెల్లం తినడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని స్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు మలబద్ధకం లాంటి సమస్యలున్న వారు బెల్లం తింటే సమస్య తగ్గుముఖం పడుతుంది. బెల్లంలో ఐరన్ బాగా ఉంటుంది. బాడీలోని శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. అయితే, షుగర్ పేషెంట్స్ బెల్లం విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.