సాధారణంగా మానవ శరీరంలో ఎప్పుడూ ఒక పరిమిత స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటుంది. అంతకంటే ఎక్కువైనా, తక్కువైనా శరీరానికి మంచిది కాదు. అయితే, కొన్నిసార్లు వాతావరణం ప్రభావం వల్ల అవసరమైన దాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రత మన శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ సమస్య ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనివల్ల అనేక రకాల శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అసలు ఈ వేడిని తగ్గించుకోవడం ఎలా? ఇప్పుడు చూద్దాం.. ఒక కారుకి ఇంజిన్ ఎలాగో మన శరీరానికి లివర్ అలాగే. లోపల లివర్ కి ఏదైనా ఇబ్బంది కలిగితే, దాని ప్రభావం శరీరంపైన ఉంటుంది. మీకు మొటిమలు రావడం, చర్మంపై పగుళ్లు రావడం, చర్మం సాగిపోవడం వంటివి జరుగుతున్నాయంటే లివర్ కి ఏదో ఇబ్బంది కలుగుతోందని అర్థం.
అదే విధంగా శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాతుగా పెరగడం, కళ్లు మంటలు రావడం, కాళ్ల మంటలు లాంటివి జరుగుతుంటే కూడా లివర్ కి ఏదో నష్టం జరుగుతోందని అర్థం. ఎందుకంటే శరీరానికి.. తన లోపల కలిగే ఇబ్బందిని బయటికి వ్యక్తపరిచే తత్త్వం ఉంది. ఉదాహరణకి.. బయట వాతావరణం వేడిగా ఉంటే ఆ వేడి నుంచి ఉపశమనం పొందడానికి శరీరం చెమట రూపంలో తనని తాను చల్లబరుచుకుంటుంది. ఇది చాలా సహజమైన ప్రక్రియ. కానీ, మనం సాధారణంగా వేడి నుంచి తప్పించుకోవడానికి ఏసీలు వాడుతూ ఉంటాం. కానీ, దానివల్ల శరీరం డీ హైడ్రేట్ అయిపోతుంది.
నిజానికి మనం తాగే నీరు వేడిగా ఉండడం, స్నానం చేసే నీరు చల్లగా ఉండడం చాలా మంచిది. కానీ, సాధారణంగా మనం వేడి నీళ్లతో స్నానం చేస్తూ, ఫ్రిడ్జ్ వాటర్ ను ఎక్కువగా తాగుతూ ఉంటాం. ఇది అసలు మంచి పద్ధతి కాదు. రాగి పాత్రలో కాచి, మరిగించిన నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే వీలైనంత వరకు ఎక్కువగా సూర్యరశ్మిలో ఉండడానికి ప్రయత్నించాలి. శరీరంలో వేడిని తగ్గించడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన పదార్థం బూడిద గుమ్మడి కాయ. ఇది శరీరంలోని ఎసిడిటీని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, బూడిద గుమ్మడికాయను వాడుకుని శరీరంలో వేడిని ఎలా తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో చూడండి..