ఆస్తమా రోగులు అంటేనే శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఊపిరి ఆగిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో వారికి మాత్రమే తెలుసు. చేపలు సముద్రం నుంచి ఒడ్డున పడితే ఎలా గిలగిలా కొట్టుకుంటాయో ఆస్తమా రోగులు కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటూ ఉంటారు. ఊపిరి తీసుకోవడం కోసం పోరాడాల్సి వస్తుంది. ఊపిరి అందక ఆయాసపడుతూ ఉంటారు. ఎన్నో మందులు వాడతారు. వైద్యులను సంప్రదిస్తారు. అయినా సరే సమస్య పూర్తిగా నయం కాదు. అయితే ఆయుర్వేదంలో ఆస్తమా చికిత్సకు సంబంధించి కొన్ని పరిష్కారాలు చూపారు. దాని ప్రకారం.. కొన్ని ప్రత్యేక పద్ధతులు పాటించడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆస్తమా బాధితుల్లో.. ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు శ్వాస మార్గం సన్నగా మారిపోతుంది. ఊపిరితిత్తుల్లో కఫం కూడా పేరుకుపోతుంది. దీని వల్ల గాలి సరిగ్గా ఆడకపోవడం లాంటి సమస్య విపరీతమవుతుంది. ఆస్తమా రోగులు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఆస్తమా రోగులకు బయట గాలిలోని దుమ్ము కూడా ఇబ్బంది పెడుతుంది. వాతావరణంలోని మార్పులను ఇలాంటి వారు అస్సలు తట్టుకోలేరు. ఇక ఆస్తమాకు ఆయుర్వేదంలో ప్రత్యేక చికిత్సలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఆస్తమా రోగులు తీసుకొనే ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారికి ఎలాంటి ఆహారం పడదో తెలుసుకొని వాటిని అవాయిడ్ చేయాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఉచ్వాస నిస్వాసలకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. ఆస్తమా తీవ్రమైనప్పుడు వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఛాతిపై గోరువెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో కాపడం చేయాలి. యూకలిప్టస్ తైలాన్ని నీటిలో కలిపి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల వెంటనే కాస్త ఉపశమనం లభిస్తుంది.
వీటిని తీసుకుంటూ.. నిపుణులు చెప్పిన సూచనలు పాటిస్తే.. ఆస్తమా సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు.