ప్రతి పండగకు కొన్ని చేయకూడని పనులు ఉన్నట్లే.. చేయాల్సిన పనులు కూడా కచ్చితంగా ఉంటాయి. అలా ఈ ఉగాదికి మీరు ఓ పనిచేస్తే.. ఈ ఏడాదంతా మీ ఇంట్లో డబ్బు నిలుస్తుందని, ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఉగాది.. మన తెలుగు లోగిళ్లలో జరుపుకొనే తొలి పండగ. ఎంతో సందడిగా చేసుకునే వేడుక. ఈ రోజు నుంచే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతిఒక్కరూ ఉగాది పచ్చడి తీసుకుంటారు. పంచాంగ శ్రవణం వింటారు. ఈ ఏడాదంతా మంచి జరగాలని దేవుడిని బలంగా కోరుకుంటారు. ఉగాది పేరు చెప్పగానే మనకు ప్రకృతి పండగ అని గుర్తొస్తుంది. చెట్లు చిగురిస్తాయి, పూల పరిమళాలతో గుబాళిస్తాయి. వసంత ఋతువు చైత్రశుద్ధ పాడ్యమి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఉగాది నాడు కొత్త పనులు చేయడం ప్రారంభిస్తారు. అయితే ఒక్క పనిచేస్తే మాత్రం ఉగాది నుంచి రాబోయే ఏడాదంతా మీకు ధనలాభమే అని పండితులు చెబుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రతి పండగకు చాలావరకు ప్రత్యేకతలు ఉంటాయి. ఆయారోజుల్లో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేదాన్ని పెద్దలు, పండితులు అప్పట్లోనే నిర్ణయించారు. అలా ఉగాదినాడు బ్రహ్మదేవుడు సమస్త సృష్టిని మొదలుపెట్టాడని పురాణాల్లో ఉంది. మత్స్యావతారాన్ని ధరించిన విష్ణుమూర్తి.. సోమకుడిని సంహరించి వేదాలను రక్షించింది ఉగాది రోజే అని చెబుతుంటారు. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఇలా చెప్పుకుంటూ పోతే ఉగాది విశిష్టతలు చాలానే ఉంటాయి. మరి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ చేయాల్సినది మాత్రం ఒకటుంది. అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో భోగభాగ్యాలు విరాజిల్లుతాయి.
మిగతారోజుల్లో చాలామంది ఉదయం 10-11 గంటల వరకు నిద్రపోతూ ఉంటారు. ఉగాదినాడు మాత్రం అలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మాంసాహారానికి దూరంగా ఉండటంతో మద్యం అస్సలు తీసుకోకూడదు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. అయితే దీన్ని దక్షిణ దిక్కుగా కూర్చొని చేయొద్దని పండితులు హెచ్చరిస్తున్నారు. ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుందని కూడా చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రాబోయే ఏడాదంతా కూడా మీ ఇంట్లో డబ్బులు నిలుస్తాయని తెలియజేస్తున్నారు. దీంతో పాటు ఓ విసినకర్రని కూడా కొనుగోలు చేస్తే మంచిదని అంటున్నారు. ఇలా ఉగాది రోజు పైన చెప్పినవి చేస్తే మీకు శుభం కలగడంతో పాటు ధనలాభం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.