ఉగాది అనగానే పచ్చడే కాదూ.. పంచాంగం కూడా చూస్తాం. ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాల సంఖ్య చూసుకుంటాం. తెలుగు నామ సంవత్సరాది వేళ వచ్చే ఏడాదంతా ఎలా గడుస్తుందా అనే లెక్కలను బేరీజు వేసుకుంటాము. అయితే దీనితో పాటు స్టార్, రాజకీయ నేతలు, ప్రముఖుల జీవితంపై కూడా కొంత మంది జాతకాలు చెబుతుంటారు. అయితే శోభకృత్ నామ సంవత్సరం వేళ, వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉండనుందంటే..?
ఉగాది అనగానే షడ్రుచులతో చేసుకునే పచ్చడే కాదూ.. ఏడాదంతా మన జాతక బలం ఎలా ఉందనే దానిపై ఆసక్తి ఉంటుంది. జాతకాలు పిచ్చి అనలేము కానీ అదో సరదా. రాశి ప్రకారం మన వాసి ఎలా ఉందో చూసుకుంటాం. ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాల సంఖ్య చూసుకుంటాం. పంచాగ శ్రవణం చేస్తాం. . తెలుగు నామ సంవత్సరాది వేళ వచ్చే ఏడాదంతా ఎలా గడుస్తుందా అనే లెక్కలను బేరీజు వేసుకుంటాము. అయితే దీనితో పాటు స్టార్, రాజకీయ నేతలు, ప్రముఖుల జీవితంపై కూడా కొంత మంది జాతకాలు చెబుతుంటారు. వేణు స్వామి లాంటి వారు అలా ప్రముఖుల జ్యోతిష్యం చెప్పి ఫేమస్ అయ్యారు. అయితే ప్రస్తుతం అటు తెలంగాణా, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం నడుస్తుండటంతో తదుపరి సీఎం పదవిని చేపట్టేది ఎవరు అన్న కూతూహలం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తదుపరి సీఎం ఆశావాహిగా ఉన్న పవన్ కళ్యాణ్ జాతకం గురించి ప్రముఖ జోతిష్య నిపుణులు ఏం చెప్పారంటే..
పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. ఈ తేదీ ప్రకారం ఆయనది లియో అంటే సింహరాశి. సమీప భవిష్యత్తులో జనసేన పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశాలున్నాయని, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆయన ఒంటరిగా కానీ, పొత్తుగానైనా పోటీ చేస్తారని తెలుస్తో్ంది. ప్రశ్రా శాస్ర్తం ప్రకారం ఆయన జనసేన ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో రాజయోగం ఉందని అన్నారు. ఆయనకు అమాత్యులయ్యే అవకాశాలున్నాయన్నారు. కొత్త మిత్రుడు ద్వారానైనా ఆయన పోటీ చేస్తారని పేర్కొన్నారు. శుక్రుడి ఫలితం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీతో సానిహిత్యం ఏర్పరుడుతుందని, ఆ మధ్య వర్తిత్వం వల్ల కూటమి సాధ్యమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 175 మంది ఎమ్మెల్యేలయ్యే జాతకం సరిగ్గా ఉంటేనే చంద్రబాబు కానీ, జగన్, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రులయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అదేవిధంగా ఆయన జాతకం ఆధారంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పలేమని మరికొంత మంది జ్యోతిష్యులు పేర్కొన్నారు. ఎలక్షన్ జరిగే రోజును బట్టి కూడా సీఎం హోదా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో లభించిన పవన్ కళ్యాణ్ పుట్టిన తేదీ ప్రకారం ఇప్పటి నుండి గ్రహస్థితి నుండి వచ్చే ఏడాది గ్రహ స్థితి వరకు పవన్ కళ్యాణ్‌కు రాజయోగం ఉందని చెప్పారు. నడుస్తున్న కాలంలో మనం చేసే పనుల వల్లేనే ఈ రోజు మన ముండే స్థితి ఉంటుందని అన్నారు. ప్రశ్నించడానికి, ప్రజలకు సేవ చేయడానికి జనసేన పుట్టిందని అంటున్నారని, అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలంటే ఓ పెద్ద కూటమితో జత కట్టాలని అన్నారు. అయితే ఈసారి ప్రజా తీర్పు మారనున్నట్లు తెలిపారు.