ప్రతి పండగకు కొన్ని చేయకూడని పనులు ఉన్నట్లే.. చేయాల్సిన పనులు కూడా కచ్చితంగా ఉంటాయి. అలా ఈ ఉగాదికి మీరు ఓ పనిచేస్తే.. ఈ ఏడాదంతా మీ ఇంట్లో డబ్బు నిలుస్తుందని, ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఉగాది పేరు చెప్పగానే అందరికీ పచ్చడి మాత్రమే గుర్తొస్తుంది. ఆరు రుచులతో చేసి ఈ పదార్థాన్ని దాదాపు ప్రతి ఒక్కరూ తీసుకుంటారు. దీని విశిష్టత, ఎందుకు తీసుకోవాలనేది చాలామందికి తెలియకపోవచ్చు. మరి ఉగాది పచ్చడి ఎందుకు తినాలో తెలుసా?
Vrushabha Rasi (Taurus) Ugadi Telugu Panchagam 2023: ఉగాది వచ్చేసింది. శోభకృత్ నామ సంవత్సరంలోకి మీరు అడుగుపెట్టేశారు. అందరి రాశిఫలాలతో మేం వచ్చేశాం. ఇందులో భాగంగా వృషభరాశి వాళ్లకు ఈ ఏడాది ఎలా ఉండబోతుంది? ఏంటనేది ఇప్పుడు చూద్దాం!
వినాయక చవితి అంటే ఖచ్చితంగా పాలవెల్లి కట్టాల్సిందే. ఎందుకు కడుతున్నారో తెలియకపోయినా పూర్వం నుండి మన పూర్వీకులు కడుతున్నారు కాబట్టి కట్టాలి అనే నియమం, ఆచారం ఉంది. అయితే ఇది ఎందుకు కడతారో, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి సనాతన ధర్మంలో ఉన్న ప్రతీ పండుగ, కార్యం వెనుక సైన్స్ దాగి ఉంది. రాను రాను అదొక ఆచారంగా, సాంప్రదాయంగా మారుతూ వచ్చింది. జ్ఞానం భగవంతుడు అయితే.. ఋషులు […]
గణపతి అటు జంతువు శిరస్సు కలిగి, ఇటు మానవ శరీరం కలిగి ఉంటారు. దీని వెనుక ఒక మూడు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ప్రకృతీ పురుషాత్మక అబేధ ఆకృతి ధరః గజాననః. గణపతిని కంఠం నుండి కాలి వరకూ అమ్మ వారు తయారుచేస్తే, ఆ ఏనుగు శిరస్సును శివుడు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ గణపతి శరీరం వెనుక స్త్రీ, పురుష తత్వాలు కలిసి ఉన్నాయి. ప్రకృతీ పురుషాత్మక అబేధ ఆకృతి ధరః గజాననః అని […]
వినాయక చవితి హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగ. చాలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. వినాయకుడు అంటే ఆది దేవుడు అంటారు. ఏ దేవుని పూజ చేసినా, ఏ పండుగలో అయినా ముందు పూజలు అందుకునేది ఆ గణపతి దేవుడే. అందుకే వినాయక చవితి పండుగ ఎంతో స్పెషల్. విఘ్నాలను తొలగించే దేవునిగా పేరొందిన గణపతి విగ్రహాలను ప్రతీ గ్రామంలో వీధుల్లో నిలబెట్టి నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. ఆఖరి రోజున నీటిలో నిమజ్జనం చేస్తారు. […]
Varalakshmi Vratham 2022: వరలక్ష్మీ అంటే శ్రేష్ఠమైన లక్ష్మీ అని అర్ధం.శ్రేష్ఠమైన లక్ష్మీదేవి కోసం చేసే వ్రతమే ఈ వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతం ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కీర్తి, ఐశ్వర్యం, సంపద పెరుగుతాయని చాలా మంది నమ్మకం. లక్ష్మీదేవి అంటే ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, జ్ఞాన సంపద, గుణ సంపద వంటి సంపదలను అందించే దేవత. వరలక్ష్మీ వ్రతం రోజున పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. […]
హిందువుల అతి పవిత్రమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. హిందువుల క్యాలెండర్ ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో మాఘ మాసంలో మాఘ బహుళ చతుర్దశి రోజున, మరికొన్ని ప్రాంతంలో ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షం చతుర్దశి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 1న మంగళవారం అంటే నేడు శివరాత్రిని జరుపుకుంటున్నారు. అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు శివరాత్రి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే.. ఆ కష్టాలు తీరతాయి అంటున్నారు పండితులు. ఆర్థిక పరంగా […]
మనం నిత్యం అనేక మంది దేవుళ్లను పూజిస్తుంటాము. అందులోనూ ఒక్కొక్కరు ఒక్కో దేవుడిని కొలుస్తుంటారు. అయితే అందరికి తెలిసిన మనిషి రూపంలో కష్టాలు పడిన దేవుడు శ్రీరాముడు. కొడుకుగా, భర్తగా, రాజు, అన్నగా, తండ్రిగా ఇలా ఆయన ఎంతో మందికి ఆదర్శం. రాముల వారికి దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నాయి. ఆయనతో పాటు రాముడి పరమభక్తుడైన హనుమంతుడికి కూడా అనే ఆలయాలు ఉన్నాయి. ఆంజనేయుడిని తలుచుకుంటే.. ఎలాంటి దృష్ట శక్తులు దగ్గరకు రావని భక్తుల నమ్మకం. […]
మనం అనేక పండగలు జరుపుకుంటాం. వాటిల్లో ప్రధానమైన పండగ సంక్రాంతి. ఈ పండగను.. భోగి, మకర సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటాం. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండగ కనుమ. దీన్నే పశువుల పండగ అని కూడా అంటారు. ఈ పండగ గురించి పురాణాల్లో చాలానే కథలు ఉన్నాయి. కనుమను పశువుల పండగగా ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన పురణాలు చెబుతున్నాయి. ఒక ఆచారంగా వస్తున్న ఇంద్రుడిని పూజించడం తగదని […]