రెండు తెలుగు రాష్ట్రాల్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. అలానే ఏపీ ప్రజలు ఉగాది పర్వదినాన్ని కన్నులపండువగా జరుపుకుంటున్నారు. ఉగాది అనేది తెలుగువాళ్ల కొత్త సంవత్సరం కాబట్టి.. ఈ ఏడాది జాతకరీత్యా ఎలా ఉండబోతోంది? అనేది తెలుసుకోవాలి అనుకుంటారు. తమ జాతకాలే కాకుండా.. ప్రముఖుల జాతకాలూ ముఖ్యంగా రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. అలానే ఏపీ ప్రజలు ఉగాది పర్వదినాన్ని కన్నులపండువగా జరుపుకుంటున్నారు. ఉగాది అనగానే అందరికీ ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. షడ్రుచుల ఉగాది పచ్చడిని కచ్చితంగా స్వీకరించాలి అని చెబుతారు. అలాగే ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది అనేది తెలుగువాళ్ల కొత్త సంవత్సరం కాబట్టి.. ఈ ఏడాది జాతకరీత్యా ఎలా ఉండబోతోంది? అనేది తెలుసుకోవాలి అనుకుంటారు. తమ జాతకాలే కాకుండా.. ప్రముఖుల జాతకాలూ ముఖ్యంగా రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతకం ఎలా ఉందో పండితులు చెప్పారు.
పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిది మిథున రాశి ఆర్థ నక్షత్రం. ఈ రాశివారికి అష్టమా శని తొలగిపోయింది. 1972 డిసెంబర్ 21న జగన్ మోహన్ రెడ్డి జన్మించారు. మిథునరాశిలో చంద్రుడు రాహు నక్షత్రంలో సంచరిస్తుండగా మీనాలగ్నం జగన్ మోహన్ రెడ్డి జన్మించారు. ప్రస్తుతం బుధమహాదశ నడుస్తుంది. ఇది ఎంతకాలం ఉంటుంటే 2024 అక్టోబరు 31 వరకు ఉంటుంది. వచ్చే సంవత్సరం రాబోయే ఎన్నికల్లో ఆయనకు మంచి ఫలితాలు చూస్తారు. ఆతరువాత శని ప్రభావం కారణంగా కాస్త కష్టపడాల్సి వస్తుంది. బుధ మహాదశలో శని అంతర దశ వచ్చి.. 2027వ సంవత్సరం జులై వరకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.
ఆయన కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. ఈయనకు మంచి రాజయోగం ఉందని పండితులు తెలిపారు. బృహస్పతి దశమ స్థానంలో ఉండడం వల్ల వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పండితులు సూచించారు. మొత్తానికి ఈ ఏడాది దైవ బలాన్ని అత్యధికంగా సంపాదించుకుంటే తిరుగులేని విధంగా జగన్ సమర్థత అనేది ఏపీలో చాటే సంవత్సరంగా ఉంటుందని అన్నారు. రాజకీయ పరంగా చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ప్రజలు చూడబోతున్నారని పండితులు తెలిపారు. మరి.. సీఎం జగన్ జాతకం గురించి పండితులు చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.