ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చినా.. సామాన్యులకంటే సెలబ్రిటీల సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనే తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువగా కనిపిస్తుంది. అభిమాన తారలు ఈసారి ఫెస్టివల్ కి ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపిస్తారో లేక కొత్తగా సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడతారో అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి.. సితార పెట్టిన కొత్త పోస్టుని సోషల్ మీడియన్స్.. తెగ వైరల్ చేస్తున్నారు.
సాధారణంగా ఫెస్టివల్స్ వచ్చినా.. సామాన్యులకంటే సెలబ్రిటీల సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనే తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే.. అభిమాన తారలు ఈసారి ఫెస్టివల్ కి ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపిస్తారో లేక కొత్తగా సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెడతారో అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. వీళ్ళను ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని.. సెలబ్రిటీలు కూడా ముందుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి.. విష్ చేస్తుంటారు. అంతే.. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు.. అన్నట్లుగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆయా సెలబ్రిటీల పోస్టులు షేర్ చేసి.. రచ్చ చేసేస్తుంటారు.
ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి.. సితార పెట్టిన కొత్త పోస్టుని సోషల్ మీడియన్స్.. అలాగే వైరల్ చేస్తున్నారు. ఉగాది సందర్భంగా అందరినీ విష్ చేస్తూ.. లంగావోణీలో దిగిన పిక్, వీడియో షేర్ చేసింది సితార. అంతే.. ఆల్రెడీ మిలియన్స్ లో ఫ్యాన్స్, ఫాలోయర్స్ ఉన్నారు.. ఊరుకుంటారా! వెంటనే నిమిషాలలో సితార పిక్ ని నెట్టింట ట్రెండింగ్ లో నిలిపారు. హీరోహీరోయిన్ల పిల్లల్లో సితారకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. కాగా.. ఎల్లో – గ్రీన్ కాంబినేషన్ లో సితార ధరించిన లంగావోణీ.. ప్రస్తుతం నెటిజన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ ల ముద్దుల కూతురుగానే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ మనవరాలిగా సితార అందరికీ సుపరిచితమే. అచ్చంగా పేరెంట్స్ అందాన్ని, కళను పుణికిపుచ్చుకొని సితార.. ఇప్పటికే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. చిన్న వయసులోనే మిలియన్స్ లో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న సితార.. ఓవైపు చదువుకుంటూనే.. మరోవైపు క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంటోంది. పైగా మోడలింగ్ వైపు కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నటిగా సినిమాలు చేస్తుందో లేదో తెలియదు. కానీ.. మోడల్ గా మాత్రం ఫ్యూచర్ లో అదరగొట్టనుందని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి సితార ఏం చేయనుందో! మరి మహేష్ గారాలపట్టి సితార గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.