తెలుగు రాష్ట్రాల్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. అలానే ఏపీ ప్రజలు ఉగాది పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది జాతకరీత్యా ఎలా ఉండబోతోంది? అనేది తెలుసుకోవాలి అనుకుంటారు. తమ జాతకాలే కాకుండా.. ప్రముఖుల జాతకాలూ ముఖ్యంగా రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జాతకం ఎలా ఉందో పండితులు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో శోభకృత్ నామ సంవత్సర ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. అలానే ఏపీ ప్రజలు ఉగాది పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఉగాది అనగానే అందరికీ ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. షడ్రుచుల ఉగాది పచ్చడిని కచ్చితంగా స్వీకరించాలి. అలాగే ఉగాది రోజున అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది అనేది తెలుగువాళ్ల నూతన సంవత్సరం కాబట్టి.. ఈ ఏడాది జాతకరీత్యా ఎలా ఉండబోతోంది? అనేది తెలుసుకోవాలి అనుకుంటారు. తమ జాతకాలే కాకుండా.. ప్రముఖుల జాతకాలూ ముఖ్యంగా రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జాతకం ఎలా ఉందో పండితులు చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఆయన ఎనలేని సేవలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో జయపజయాలను ఆయన చూశారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందారు. ఈ క్రమంలో శోభకృత్ నామ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని ఆయన అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పండితులు చంద్రబాబు జాతకం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
పండితులు తెలిపిన ప్రకారం… ” ఈ సంవత్సరంలో అత్యంత అనుకూలమైన ఫలితాలు కలిగిన రాశి కన్యారాశి. చంద్రబాబు నాయుడు 1951 ఏఫ్రిల్ 20న నారావారిపల్లెలో జన్మించారు. చైత్ర శుద్ధ త్రైయోదశి శుక్రవారం జన్మించిన ఆయనది కూడా కన్యారాశి. అలానే వీరు హస్త నక్షత్రంలో జన్మించారు. చంద్రబాబు నాయుడి జాతకంలో ఈ ఏడాది కొన్ని యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజయోగాలు.. అందులోనూ అద్వితీయమైనటువంటి యోగాలు చంద్రబాబుకు కలగనున్నాయి. గురుడి స్థానాన్ని బట్టి హంసయోగం, రవి-బుధుడు కలిసి ఉండటం బుదాదిత్య యోగం, ప్రత్యేకించి 1, ,4, 7,10 స్థానాల్లో చంద్రుడు- గురుడు ఉన్నట్లు అయితే దానిని గజకేశరి యోగం అంటారు.
చంద్రబాబు నాయుడు జాతకంలో గజకేశరి అనే ప్రధానమైన యోగం ఉంది. దీని కనీసం వందేళ్లు లేదా వెయ్యేళ్లు మనం చేసినటువంటి పనిని గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. 2024 మే నెలకు శుక్రుడి అంతదశ అత్యంత అనుకూలంగా ఉంది. అలానే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు, తీవ్రమైనటువంటి ఇబ్బందికి, అరిష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. అధికారంలో భాగస్వామి అయ్యే అవకాశం చంద్రబాబుకు ఉంది.
దేశ రాజకీయాల్లో కూడా అధికార పార్టీ కూటమిలో భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రథమార్థం నుంచి కూడా తన శ్రేణులను ఉత్సాహా పరుస్తుంటారు. ఈ ఏడాది నుంచి చంద్రబాబు నాయుడు గారు పాత సిద్ధాంతలను పక్కన పెట్టి.. కొత్త వ్యూహాలతో ముందడుగు వేస్తారు” అని పండితులు తెలిపారు. మరి.. పండితులు తెలిపిన చంద్రబాబు నాయుడి జాతక విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.