సకలదేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రమణ్య, రాఘవేంద్ర , వృషభాది దేవతలకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి వైశిష్ట్యం చాలా ఉంది. శ్రావణం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి, మంచి కలిగించడానికి, ధర్మాచరణాల ను పండుగగా ఆచరించడం నియమం. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్ధం వైపు మళ్లించి మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్యోద్దేశం.లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ నెలలో రోజూ ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే. ఈ నెలంతా మహిళలు రకరకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తారు. ఉపవాస దీక్షలు చేస్తూ లక్ష్మీదేవి అమ్మవారికి రోజూ నైవేద్యం సమర్పిస్తూ పూజలు చేస్తారు.
చాలా మంది ఈ నెలంతా మాంసం తినరు. భక్తిశ్రద్ధలతో ఇష్టదైవాన్ని కొలుచుకుంటారు. ఇలా శ్రావణమాసం ప్రతి రోజూ భక్తి శ్రద్ధలతో సాగిపోతుంది. ఉపవాస దీక్షల వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి. ఫిట్నెస్ పెరుగుతుంది. అందువల్ల అన్ని రకాలుగా శ్రావణమాసం మేలు చేస్తుంది. ఆయురారోగ్యాల్ని పెంచుతుంది.
మరిన్ని వివరాలకు ఈ వీడియో వీక్షించండి: