భారత దేశంలో గ్రామ దేవతలను ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తుంటారు. తమ కోర్కెలు నెరవేర్చే గ్రామ దేవతలకు తమకు తోచింది సమర్పించుకుంటారు. కొన్ని చోట్ల అగ్ని గుండాలు ఏర్పాటు చేసి నిప్పుల్లో నడుస్తుంటారు. పురాతన కాలం నుంచి ఇలాంటి ఆచారాలు కొనసాగుతూ వస్తున్నాయి.
దేశంలో మాతృదేవారాధన చాలా పురాతన కాలం నుంచి వస్తుంది. ఇది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ దేవతలు గ్రామ దేవతలు, కుల దేవతలు, స్థల దేవతలుగా పూజలందుకోవడం విశేషం. గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న అమ్మవారి జాతరకు వివిధ ప్రదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. తిరుణాళ్ళ పేరుతో జరిగే జాతరలు చాలా ప్రసిద్ధి చెంది ఉంటాయి. తాజాగా పూరి జిల్లాలో ఓ గ్రామంలో జరిగిన ఝాము జాతరలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పాల్గొని నిప్పుల గుండంలో నడిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
ఒడిశా.. పూరి జిల్లాలో భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి అయిన సంబిత్ పాత్రా మంగళవారం జరిగిన ఝాము జాతరలో పాల్గొన్నారు. గ్రామ దేవత అయిన దులన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో భాగంగా ఆయన పది మీటర్ల వరకు ఏర్పాటు చేసిన అగ్ని గుండంపై నడిచారు. ఈ సందర్భంగా సంబిత్ పాత్ర ‘పూరి జిల్లాలోని రెబాటి రామన్ గ్రామంలో దులన్ అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఝాము జాతరలో ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో నడిచి అమ్మవారిని పూజించాను.. గ్రామం సుభిక్షంగా ఉండాలని.. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను.. అమ్మవారి దీవెనలు పొందడం నేను చేసుకున్న పుణ్యం’ అని ట్విట్ చేశారు.
పూరిలో రెబాటి రామన్ గ్రామంలో ఝాము జాతరలో తమ కోరికలు నెరవేరాలని దులన్ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అగ్ని గుండం ఏర్పాటు చేసి నిప్పులపై నడుస్తారు. ఇక ఒడిశాకు చెందిన సంబిత్ పాత్ర 2010 లో భాజాపా లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 లో ఆయనను భాజాపా జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. 2019 లో లోక్ సభ ఎన్నికల్లో పూరి నియోజకవర్గం నుంచి పోటీ చేయగా బిజూ జనతా దళ్ అభ్యర్థి పినాకి మిశ్రా చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం సంబిత్ పాత్ర ఇండియన్ టూరీజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ యి చైర్మన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
शक्ति पूजा हमारी सनातन संस्कृति एवं परंपरा का अहम हिस्सा है, पुरी जिले के समंग पंचायत के रेबती रमण गांव में आयोजित यह दण्ड और झामू यात्रा इसी प्राचीन परंपरा का प्रतीक है।
इस तीर्थयात्रा में अग्नि पर चलकर मां की पूजा-अर्चना एवं आशीर्वाद प्राप्त कर, खुद को धन्य अनुभव कर रहा हूँ।… pic.twitter.com/oTciqW61Gj
— Sambit Patra (@sambitswaraj) April 11, 2023