శ్రావణ మాసం. ఇంటి మహాలక్ష్మీగా వరలక్ష్మీ పూజను కోడలితో చేయించడం ఇలా అమ్మవారి అంశగా ఆడపిల్లకు పుట్టింటా మెట్టింటా గౌరవం ఇచ్చి శ్రావణ మాసం పర్వదినాలు సంతోషంగా గడిపే మాసం శ్రావణం. తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసాల్లో ఇది ప్రధానమైనది. కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుందీ శ్రావణం. ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమై పోతారు. ఇక ఆధ్యాత్మికంగా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతీ పాత్రమైనదిగా చెబుతారు.
ఈ సమయంలో మహిళలు దోసిట్లో శనగలు, వాయినాలు, కాళ్లకు పసుపు రాసుకోవడం, చేతులకు తోరణాలు, కొత్త చీరలు, పట్టుచీరలు, బంగారు నగలు, గాజులు, ఆభరణాలతో పాటు అంతా పండుగ వాతావరణంలా కనిపిస్తుంది. ఈ మాసంలో మహిళల్లో చాలా మంది గౌరీ పూజలు చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా చంద్ర గ్రహణ నివారణకు గౌరీపూజ, లలితాపూజలను చేస్తూ ఉంటారు.
ఈ మాసంలో శుక్రవారం నాడు లలితా పూజను చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చంద్రుని నుండి వచ్చే దుష్ఫరిణామాలు తగ్గిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రావణం శివుని ఆరాధనకు అనుకూలమైంది. శివుని పూజించడం వల్ల వివాహంలో ఏర్పడిన ఆటంకాలు తొలగి, చేపట్టిన పనిలో విజయం లభిస్తుందని వేదాలు, పురాణాలు పేర్కొన్నాయి.
మరిన్ని వివరాలకోసం ఈ వీడియో వీక్షించండి: