దేశంలో ఎంతో పవిత్రంగా జరుపుకునే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి ని వ్యాస మహాముని జన్మతిథి గా అంటారు.. అందుకే ఈ రోజును మహా పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజు గురు భగవానుడిని, వ్యాస మహర్షిని నియమ నిష్టలతో పూజిస్తే అన్ని శుభాలు జరుగుతాయని అంటారు. ఇక ‘గు’ అంటే అంధకారం.. చీకటి అని అర్థం. ‘రు’ అంటే తొలగించడం అని అర్థం. అందుకే అనాధిగా ‘గురు’ అనే పదానికి ఎంతో గొప్ప స్థానం ఉంది.
ప్రపంచంలో ఉన్నహిందువులు గురు పౌర్ణమి ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. హిందూమతంలో గురు పూర్ణిమను ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ ఏడాది గురు పౌర్ణమి 13 జూలై 2022 బుధవారం జరుపుకుంటున్నారు. గురు పౌర్ణమి రోజున ఉదయం లేవగానే ఈ మూడు పనులు తప్పకుండా చేయాలి.. అలా చేస్తే ఏం జరుగుతుందో అనే విషయం గురించి పూర్తి వివరాలు రమా రవి గారి మాటల్లో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.