గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష సమయంలో వస్తుంది. చాతుర్మాస సమయంలో గురువులు ఎక్కడి వెళ్లకుండా నాలుగు నెలలు ఒకే చోట ఉంది శిష్యులను జ్ఞానవంతులను చేయు సమయం. ఈ క్రమంలో తమకు సమీపాన ఉన్న గురువులను పూజిస్తారు.
మనకు ఆది గురువు వేద వ్యాసుడు. వేదవ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి రచించాడు. కాబట్టి వేద వ్యాసుడు అంటారు. వేదాలు కాకుండా మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు కూడా రచించాడు. హిందువులకు ఆధ్యాత్మిక వారసత్వం అందించినందున ఆది గురువుగా పూజిస్తారు. ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమిగా , వ్యాస పౌర్ణమిగా పరిగణిస్తారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కుతుంది. ప్రాచీన కాలం నుండి గురువు అనగానే వ్యాస మహర్షి పేరే మనకు గుర్తుకువస్తుంది. ఆయన జన్మ దినాన్ని పవిత్ర రోజుగా భావించి జరుపుకుంటారు. ఇలా గురువులను పూజించి వారిని స్మరిస్తే సకల సంపదలు కలుగుతాయని నమ్మకం.
గురు పౌర్ణమి నాడు చేసే కార్యక్రమం గురువును పూజించడం లేదా గురువుకు నమస్కరిండం. అయితే ప్రతి వ్యక్తి తన జీవితంలో గురుభావం గల వ్యక్తులకు ఎవరినైనా పూజించవచ్చు. తప్పకుండా గురువు ఆశీస్సులు పొందుతారు.
గురు బ్రహ్మ గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష సమయంలో వస్తుంది. చాతుర్మాస సమయంలో గురువులు ఎక్కడి వెళ్లకుండా నాలుగు నెలలు ఒకే చోట ఉంది శిష్యులను జ్ఞానవంతులను చేయు సమయం. ఈ క్రమంలో తమకు సమీపాన ఉన్న గురువులను పూజిస్తారు. అందుకు గురుపూజ శ్రేష్టమైనదిగా తెలుస్తుంది. అయితే దీనికి ఓ కథ ఉంది. ఆ కథ వివరాలు తెలుసుకుందాం..
పూర్వకాలంలో వారణాసి ప్రాంతంలో బ్రాహ్ణణులు నివాసముండేవారు. వారు కడుపేదరికం అనుభవిస్తుండేవారు. బ్రాహణుని పేరు వేదనిధి, ఆయన భార్య పేరు వేదవతి. వీరు సంతానం కోసం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వ్యాస భగవానులు గంగానదికి స్నానానికి వస్తున్నాడని ఈ బ్రాహ్మణ దంపతులు తెలుసుకున్నారు. ఆ గురువును ఎలాగైనా దర్శించుకోవాలని అనుకుంటారు. అనుకోకుండా ఓ రోజు ఒక భిక్షగాడు చేతిలో కమండలంతో వచ్చి భిక్ష కోరగా ఇద్దరు దంపతులు అతని కాళ్లపై పడతారు. మీరు వ్యాస భగవానులని మేం గ్రహించాం. తరువాత రోజు వారి తండ్రి కార్యం ఉందని తప్పకుండా రావాలని ఆహ్వానిస్తారు. మరునాడు వారి కార్య ముగిసిన తర్వాత వారి ఆతిథ్యానికి ముగ్ధుడై వారిని ఏం వరం కావాలో కోరుకోమంటాడు. తమకు సంతానం కలగాలని వారు కోరుకుంటారు. దీంతో వ్యాస మహర్షి త్వరలో మీకు 10 మంది కుమారులు జన్మిస్తారని ఆశీర్వదిస్తాడు. వారు విద్యబుద్ధలు కలవారై వెలుగొందుతారని దీవిస్తాడు. కొంతకాలం తరువాత వారికి కుమారులు జన్మించారు. వారి జీవితం సుఖవంతమవుతుంది. అందుకే గురు పౌర్ణమి రోజున ఏదికోరుకున్నా నెరవేరుతుందని నమ్ముతారు. గురువులను తప్పకుండా పూజించి వారి ఆశీర్వాదం పొందుతారు.