తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది పర్వదినం వచ్చేసింది. కొత్త సంవత్సరం కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరూ తమ రాశి ఎలా ఉందో అని తెలుసుకోవాలనుకుంటారు. మరి మకర రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.
తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది. ఇందులో భాగంగా ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఈ సంవత్సర ఉగాది మాత్రం అందరికీ ప్రత్యేకం కానుంది. దీనిలో భాగంగా ఈ తెలుగు వారి కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు నింపనుంది. ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు ప్రదీప్ జోషి ఈ సందర్భంగా ఈ ఉగాది పండగను “శోభా కృత నామ సంవత్సరంగా నిర్ణయించారు. శోభా కృత సంవత్సరం అంటే అందరికీ మంచే జరుగుతుందని అర్థం. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాల్లో ఒక మంచి భావనతో ముందుకు వెళ్తారని సూచించారు. ఋతువులు మారినట్టే మన జీవితాల్లో కూడా మార్పు రావాలని చెప్పుకొచ్చారు.
ఈ సంవత్సరం మకర రాశి వారికి రానున్న రెండున్నర సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి అంతగా కలిసి రాదనే చెప్పాలి. బాటమ్ 10 లో ఈ రాశి కూడా ఉంటుంది. ఈ క్రమంలో వీరు ఎక్కడికి కదలకుండా ఫ్యామిలీని అట్టిపెట్టుకొని ఉండడమే మంచిది. ముఖ్యంగా మీకు ఏదైనా ఆఫర్ వచ్చిందని ఎవరైనా మిమ్మల్ని మభ్య పెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ రాశి వారికి మూడో స్థానంలో రాహువు ఉండటం వలన అన్న తమ్ములతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ సోదరులతో మీరు మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది. తిన్నామా? పడుకున్నామా? తెల్లారిందా? తప్పితే మీరు ఎలాంటి కొత్త ప్రయత్నాలు చేయకూడదని ఈ రాశి తెలియజేస్తుంది.
ఎవరినీ నమ్మకుండా ఈ రెండున్నరేళ్లు జాగ్రతగా ఉండి.. మీ పని మీరు చూసుకుంటే అంతా మీకు మంచే జరుగుతుందని జోతిష్యుడు ప్రదీప్ జోషి ఈ రాశి వారి గురించి తెలియజేశాడు. ఇంకా మకర రాశి వారు ఎక్కడికి కొత్త ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాలు చేయాలని చాలా వ్యక్తులు మిమ్మల్ని ప్రేరేపించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఇక్కడే ఉంటావా? ఇదేనా నీ జీవితం? ఇకనైనా ముందుకు కదలవా? అని చాలా మంది మిమ్మల్ని తప్పు దోవ పట్టించే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలని మకర రాశి తెలియజేస్తుంది.