కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే తిరుమల తిరుపతికి సంబంధించిన ప్రతి చిన్న విషయాలం తెలుసుకోవాలని ప్రపంచ నలుమూల ఉన్న శ్రీవారి భక్తులు ఆసక్తిగా చూస్తుంటారు. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ ఓ శుభవార్త చెప్పింది.
2021 నవంబర్ లో తిరుపతి కురిసిన భారీ వర్షాల గురించి ఇప్పటికీ ఎవరు మరచి పోలేదు. ఈ భార్షీ వర్షాల ధాటికి తిరమల, తిరుపతిలోని పలు ప్రాంతాలు ధ్వంసమైనాయి. ఈ వరదలకు శ్రీవారి మెట్లు మార్గం కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి నేటి వరకు శ్రీవారి మెట్లు మార్గాన్ని టీటీడీ మూసివేసింది. అనంతరం ఆ మార్గానికి మరమత్తులు టీటీడి చేపట్టింది.ఈక్రమంలో ఇటీవల ఆ పనులు పూర్తి చేసింది. దీంతో శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 1 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది.
శ్రీవారి మెట్లు మార్గం ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్న అలిపిరి నడక మార్గం ద్వారానే పైకి వెళుతున్నారు. తాగా శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులోకి రానున్న క్రమంలో భక్తులు ఈ మార్గాన్ని ఉపయోగించుకోచ్చు.దీంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకోవచ్చు. కాగా..వరుస సెలవులు రావటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. మరి.. చాలా విరామం తరువాత శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి లభించం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.