ప్రపంచంలో ప్రస్థిది చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే తమ సామర్థ్యం మేరకు భక్తులు స్వామి వారికి విరాళం సమర్పిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు శ్రీవారికి భారీ విరాళం అందించారు.
ప్రపంచంలో ప్రస్థిది చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే తమ సామర్థ్యం మేరకు భక్తులు స్వామి వారికి విరాళం సమర్పిస్తుంటారు. బంగారం, వెండీ, విదేశీయ కరెన్సీలు కూడా శ్రీవారికి విరాళంగా భక్తులు ఇస్తుంటారు. అంతేకాక టీటీడీ పరిధిలో పనిచేస్తున్న వివిధ సంస్థలకు, ట్రస్టులకు కూడ భక్తులు విరాళాలు అందజేస్తుంటారు. కొందరు భక్తులు అయితే భారీగా స్వామి వారికి విరాళం సమర్పిస్తారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు శ్రీవారికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే స్వామి వారి దర్శనంకు వచ్చిన భక్తులు విరాళాలు సమర్పిస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారికి ఇద్దరు భక్తులు భారీ విరాళాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఏవీకే ప్రసాద్, ఆంజనేయ ప్రసాద్ కోటిరూపాయలు శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. విరాళంకి సంబంధించిన డీడీని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. శ్రీవారికి సమర్పించిన ఈ విరాళం శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు అందజేశారు. అలానే అనంతపురంకు చెందిన శ్రీధర్ దంపతులు టీటీడీ వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం అందజేశారు.
ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ధర్మా రెడ్డికి అందజేశారు. ఇక శ్రీవారి దర్శన విషయానికి వస్తే.. గత కొన్ని రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇప్పటికే కొన్ని కళాశాలకు,సంస్థలకు సెలవులు ప్రకటించడంతో తిరుమలకు తాకిడి పెరిగింది. అలానే వీకెండ్‌తో పాటూ విద్యార్థులకు పరీక్షలు పూర్తి కావడంతో రద్దీ పెరిగింది. శుక్రవారం 66,310 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. మరి.. టీటీడీ సంబంధించిన ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.