ప్రపంచ నలుమూల నుంచి నిత్యం తిరుమలకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలానే వారి సౌకర్యార్ధం టీటీడీ కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. తాజాగా భక్తులకు టీటీడీ అధికారులు ఓ శుభవార్త చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
మన దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటుంది. అలానే శ్రీవారి దర్శనంతో పాటు ఇతర తిరుమలకు సంబంధించిన విషయాలను టీటీడీకి భక్తులకు తెలియజేస్తుంది. అలానే భక్తుల సౌకర్యార్థం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అది భక్తులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి.. టీటీడీ చెప్పిన ఆ శుభవార్త ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు భక్తుల సౌకర్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. తిరుమల ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను టీటీడీ నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో భక్తులు తిరుపతి, తిరుమల్లోని దుకాణాల్లో భారీగా ఖర్చు చేసి స్టీల్, రాగి వాటర్ బాటిల్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే తాజాగా వాటర్ బాటిల్ విషయంలో భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. దేవస్థానం వారే భక్తులకు రాగి, స్టీల్ వాటర్ బాటిల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద రాగి, స్టీల్ నీళ్ల బాటిళ్లను అందుబాటులోకి తెచ్చారు. తక్కువ ధరకే ఈ వాటర్ బాటిళ్లను భక్తులకు అందించనున్నారు. రాగి వాటర్ బాటిల్‌కు రూ.450, అదే స్టీల్ నీళ్ల బాటిల్ ను రూ.200లకు అందిస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే తిరుమల వ్యాప్తంగా ఉన్న టీటీడీ విచారణ కేంద్రాల్లోఈ నీళ్ల బాటిళ్ల అమ్మకాలను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇక మరోకవైపు తిరుమలలో మే 14-18 ఐదు రోజుల పాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
హనుమాన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఎస్‌వీబీసీ, ఇంజినీరింగ్, శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం, ఇతర విభాగాల చెందిన అధికారులు అందరు కలిసి సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. మంగళవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో అన్ని విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మరి.. వాటర్ బాటిళ్ల విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.