మన దేశంలో చాలా మంది జ్యోతిష్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ జ్యోతిశ్రాస్త్ర ప్రకారం సూర్య గ్రహణం, చంద్రగ్రహణం ఏదైనా సరే అవి రాశులపై ప్రభావం చూపిస్తుంటాయని గట్టిగా నమ్ముతుంటారు. ఏ గ్రహణం అయినా సరే కొన్ని రాశులవారికి శుభం కలిగిస్తే.. కొన్ని రాశుల వారికి అశుభం కలిగిస్తుంది. దీపావళి తర్వాత ఈ ఏడాదికి చివరిగా సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబర్ 8, 2022న ఏర్పడింది.
వాస్తవానికి 7వ తారీఖు మధ్నాహ్నం నుండే పౌర్ణమి వచ్చింది కనుక.. ఆ రోజు సాయంత్రం నుంచి కొన్ని దైవ కార్యాలు అంటే.. పౌర్ణమి వ్రతాలు కానీ.. జ్వాలా తోరణాలు కానీ పౌర్ణమికి సంబంధించిన ఆరాధనలు చేసుకోవొచ్చు. 8వ తారీఖు మధ్నాహ్నం గ్రహణం సంబవిస్తుంది కనుక ఉదయం నిత్య రుద్రాభిషేకాలు.. నిత్య కైంకర్యాలు చేసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయాల్లో.. గ్రహణం పూర్తయిన తర్వాత చేయకూడాని పనులు ఏమీటో సుమన్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పూర్తి వివరాలు బ్రహ్మశ్రీ పి.వి. భరత్ శర్మ వివరంగా తెలియజేశారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.