కొన్ని కొన్ని అద్భుతాలు మానవ మేథస్సుకు కూడా అందవు.. అర్థం కావు. అలాంటిదే ఈ దైవాద్భుతం. ఒక్కటే శివలింగం రంగులు మారుతూ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ప్రత్యేక శివలింగం ఉంది ఎక్కడో కాదు మన రాష్ట్రంలోని భీమవరంలోనే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శివాలయంలోని శివలింగం అమావాస్య రోజు గోధుమ రంగులో, పౌర్ణమి రోజు తెలుపు రంగలో భక్తులకు దర్శనమిస్తుంది.
ఈ శివలింగం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని అందుకే ఈ లింగాన్ని సోమేశ్వర లింగం అని పిలుస్తారు. ఈ లింగం చంద్రుని ఆకారం మారుతున్న క్రమంలో రంగులు మారుతుందని నమ్మకం. అందుకే అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు ఆ సమయంలో శివలింగం గోధుమ రంగులోనూ, పౌర్ణమి నాడు నిండు చంద్రుడు కనిపిస్తాడు ఆ సమయంలో లింగం తెలుపు రంగులో దర్శనమిస్తుంది. మరి మీరు కూడా ఈ అద్భుత లింగాన్ని దర్శన చేసుకుని తరించండి.
ఇదీ చదవండి: విగ్రహానికి రుతుస్రావం జరిగే కామాఖ్యదేవి దేవాలయ విశిష్టతలు