తమ ప్రేమను పెద్దలు అంగీకరించరు లేదా ఒప్పుకోవడం లేదన్న కారణంగా ప్రేమికులు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుల మతాలు, ఆస్తి అంతస్థులు తమకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయని, తాము పెళ్లితో ఒక్కటవ్వలేమన్న ఆలోచనలో పడి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ప్రేమే జీవితమనుకుని, అదే శాశ్వతమనుకుని బతికేస్తున్నారు నేటి యువత. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరు లేదా ఒప్పుకోవడం లేదన్న కారణంగా ప్రేమికులు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుల మతాలు, ఆస్తి అంతస్థులు తమకు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయని, తాము పెళ్లితో ఒక్కటవ్వలేమన్న ఆలోచనలో పడి క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తమ ప్రేమను పెళ్లి పీటలు ఎక్కించేందుకు విఫల ప్రయత్నాలు చేసి ఓడిపోతే.. అతడు లేదా ఆమె లేని జీవితం వ్యర్థమని భావించి ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా ఇద్దరు ప్రేమికుల జంట బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలవర పాటుకు గురి చేస్తున్నాయి.
అనంతపురం జిల్లాకు చెందిన వినీషా, వెంకట్ నాయడు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని అన్నమయ్య జిల్లాలోని మదన పల్లి మండలంలోని అబ్బగొంది అడవిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతపురం జిల్లా అని రూరల్ సీఐ.సత్యనారాయణ సోమవారం ఉదయం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురం జిల్లా, కూడేరు మండలం, ఉదురిపికొండకు చెందిన బోయ రమణ కుమార్తె బి.వినీషా (17) అదే గ్రామానికి ధనంజయ కొడుకు ముత్తులూరు వెంకట నాయుడు(28)ని ప్రేమించింది.
పెద్దలు అంగీకరించరన్న కారణంగా.. ఈనెల9 రాత్రి ఇంటి నుండి పారిపోయి వచ్చేశారు. తాజాగా మదనపల్లి అబ్బగొంది అడవిలో చున్నీతో ఉరేసుకుని మృతి చెంది కనిపించారు. అలాగే కూకట్ పల్లి కేపీహెచ్‌బీలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వీరు ఓ పెళ్లి నిమిత్తం హైదరాబాద్ వచ్చి.. ఫేజ్-7లో ఉన్నస్నేహితుడి రూంలో స్టే చేశారు. అనంతరం ఉరివేసుకుని ఈ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు భీమవరానికి చెందిన శ్యామ్, జ్యోతిలుగా పోలీసులు గుర్తించారు. వీరి మరణాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.