దేశంలో అత్యాచారాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓవైపు ప్రభుత్వాలు నిర్భయ చట్టం అమలు పరుస్తున్నా కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు. ఓ ఎస్సీ బాలికపై పదిమంది కామాంధులు అత్యాచారం చేసి గర్భవతిని చేశారు. మైనర్ బాలిక ఫై 10 మంది అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
ప్రొద్దుటూరు పట్టణం ఒక బాలికపై దారుణం జరిగింది. బిక్షాటన చేస్తూ జీవిస్తున్న బాలికపై కొంత మంది యువకుల కన్నుపడింది. ఆమె తల్లి చాలా సంవత్సరాల క్రతం కన్నుమూసింది.. తండ్రి కూడా బిక్షాటన చేస్తూ బతుకుతున్నాడు. బాలిక ఉంటున్న వీధిలో డెకరేషన్ చేసే చెంబు ఒక యువకుడు ఆ బాలికను ఎలాగైన అనుభవించాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. చెంబు అతని స్నేహితులతో కలి బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
బాలిక బాధ గురించి వివరిస్తూ.. ఆమె ఆరోపణలను ఫైల్ చేసి పట్టణంలోని ఓ సీఐ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఈ విషయం గురించి బయటకు తెలిస్తే రచ్చ అవుతుందని భావించిన ఆయన ఒక ఆశ్రమానికి తరలించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు నింధితులపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. నేరస్తులు ఎవరో ఆ బాలిక చెప్పినప్పటికీ ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.