Hanamkonda: ఓ యువకుడి ప్రేమ వేధింపులకు ఓ యువతి బలైంది. స్నేహితుడితో కలిసి యువతి ఇంటికెళ్లి మరీ అతడు బెదిరింపులకు పాల్పడ్డాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని, పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హన్మకొండ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం, గట్లనర్సింగాపూర్‌కు చెందిన నమిండ్ల శ్వేత కరీంనగర్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మీసాల వంశీ గత కొన్నినెలలుగా ఆమె వెంటపడుతున్నాడు. ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఆమె కుదరదని చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వంశీ తన స్నేహితుడితో కలిసి శ్వేత ఇంటికి వెళ్లాడు.
శ్వేతతో గొడవ పడ్డాడు. అదే సమయంలో ఆమె తండ్రి అక్కడికి వస్తుండటం వంశీ చూశాడు. భయంతో బయటికి పరుగులు తీశాడు. బయటికి పారిపోతూ.. ‘‘ నన్ను ప్రేమించు.. లేదంటే నిన్ను ఎప్పటికైనా చంపేస్తా, నీ పరువు తీస్తా’ అని బెదిరించాడు. శ్వేత.. వంశీ వేధింపులు భరించలేకపోయింది. దాన్నో అవమానంగా భావించింది. శనివారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్వేత తండ్రి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : love: ముగ్గురు ప్రియురాళ్లతో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు.. కథ అడ్డం తిరిగింది..