Hyderabad: చిన్న చిన్న విషయాలకే అర్థంపర్థం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు కొందరు యువతీ,యువకులు. కన్న తల్లిదండ్రులు తిట్టినా భరించలేకపోతున్నారు. క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తండ్రి తిట్టాడన్న మనస్తాపంతో ఓ యువతి తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్, నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని విఠల్‌వాడికి చెందిన మనీష్ నాయుడు కుమార్తె హర్షిణి.
శనివారం మనీష్‌నాయుడు ఇంట్లో ఏవో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన హర్షిణిని కోప్పడ్డాడు. తను ఎంతగానో అభిమానించే తండ్రి తిట్టడంతో హర్షిణి మనసు చిన్నబోయింది. తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ ఇంట్లో ఉండటం కంటే బయటకు వెళ్లిపోవటమే మేలనుకుంది. ఆదివారం ఉదయం బయటకు వెళుతున్నానని చెప్పి ఇంటికి తిరిగిరాలేదు.
కూతురు ఎంత సేపటికి తిరిగిరాకపోటంతో ఆమె తల్లిదండ్రులు అంతా వెతికారు. హర్షిణి ఫ్రెండ్స్‌ను కూడా అడిగారు. ఫలితం లేకపోయింది. దీంతో నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికైనా హర్షిణి ఆచూకీ తెలిసినట్లయితే 94906 16314లో సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ కోరారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Hyderabad: రూ.3 వేల కోసం ఇలా చేశావేంటి తల్లి? పిల్లలను కూడా కాదని!