ఈ మధ్య కాలంలో యువతులు, మహిళలపై లైంగిక వేధింపులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. వావి వరసలు మరిచి ఏకంగా సొంత తండ్రులు కూడా కూతుళ్లపై లైంగికంగా వేధిస్తున్నఘటనలు చాలానే చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ వార్తకు విరుద్దంగా ఓ వివాహిత 8 ఏళ్ల బాలుడిపై లైంగికంగా వేధించిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున కలకలం రేపుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తి పరిధిలోని బార్కస్ లో 2017 నంచి మంజుల అనే మహిళ ఓ పాఠశాలలో ఆయాగా పని చేస్తోంది. దీంతో పిల్లలను చూసుకోవటం, లేదంటే పాఠశాలకు సంబంధించిన పనుల్లో నిమగ్నమవుతూ ఉండేది. పిల్లలు కూడా సొంత తల్లిగా భావించేవారు. అయితే తాజాగా ఈ ఆయా వేధింపులు శృతిమించి ఏకంగా 8 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం వాస్తవం. అయితే పాఠశాలలోని 8 ఏళ్ల బాలుడు బాత్ రూంలోకి వెళ్లటం చూసిన ఆయా అతని వెంబడే బాత్ రూంలోకి వెళ్లింది. వెళ్లిన తర్వాత ఆ బాలుడిపై లైంగికంగా వేధించటం మొదలు పెట్టింది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరిస్తూ సిగరెట్ తో కాల్చింది.
ఇక ఇదే విషయం ఆ బాలుడి తల్లిదండ్రులకు వరకూ వెళ్లింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన బాలుడి తల్లిదండ్రులు చంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఆయాపై కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరు పరిచారు. ఇక కోర్టు మాత్రం ఆ మహిళ చేసిన లైంగిక దాడిపట్ల సంచనమైన తీర్పును వెలువరించింది. ఏకంగా ఆ మహిళకు 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మహిళ బాలుడిపై చేసిన ఆఘాయిత్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.