ప్రేమ పేరుతో ఈ రోజుల్లో కొంతమంది యువకులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ప్రేమించాలని వెంటపడడం, లేదంటే హత్యలు, మానబంగాలు చేస్తూ చివరికి ప్రాణాలు తీస్తున్నారు. అయితే ప్రేమ పేరుతో యువకుల వేధింపులను భరించలేని కొంతమంది అమ్మాయిలు బలవన్మరణానికి పాల్పడి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది వరంగల్ జిల్లా చెర్యాల మండలం చుంచునకోట. ఇక్కడే ఓ యువతి (19) తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఇదే గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు ఆ యువతిని ప్రేమించాలంటూ గత కొన్ని రోజుల నుంచి వెంటపడుతున్నాడు. యువతి మాత్రం నాకు ఇష్టం లేదు, నా వెనకాల పడొద్దని ఎన్నో సార్లు చెప్పి చూసింది. కానీ, ఆ యువకుడు మాత్రం ఇవేం పట్టించుకోకుండా తరుచుగా వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ యువతి నరేష్ టార్చర్ ను భరించలేకపోయింది. దీంతో ఇటీవల ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
ఇక సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా.. కూతురు ఇంట్లో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ ను చూసిన ఆ యువతి తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడ్చారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.