Warangal: వరంగల్ జిల్లాలో ఘోరం విషాదం చోటుచేసుకుంది. పాత భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన 60 ఏళ్ల తిప్పారావు.. మండి బజార్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి ఓ వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనతో పాటు సలీమ అనే మహిళ కూడా అక్కడే పనిచేస్తోంది. ఈ ఇద్దరూ ఆ భవనం దగ్గరలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు.
శుక్రవారం సాయంత్రం సలీమా కుమారుడు 22 ఏళ్ల ఫిరోజ్ ఆమెను చూసేందుకు నగరానికి వచ్చాడు. ఇద్దరూ కలిసి గుడిసెలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున వర్షం కారణంగా వారి గుడిసెలకు సమీపంలో ఉన్న పాత భవనం కుప్పకూలింది. ఆ భవనం గోడలు సలీమా గుడిసెపై పడ్డాయి. ఈ ఘటనలో తిప్పారావు, ఫిరోజ్‌లు అక్కడికక్కడే మరణించారు. సలీమా తీవ్రంగా గాయపడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సలీమాను ఆసుపత్రికి తరలించారు. కాగా, సలీమా కుమారుడు ఫిరోజ్‌కు ఈ మధ్యే వివాహం నిశ్చయమైంది. ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. నిశ్చితార్థానికి సంబంధించిన వస్తువులు కొనడానికి వరంగల్ వచ్చారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : భార్య టార్చర్ తట్టుకోలేక భర్త ఆత్మహత్య!